ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త ఎ3 నిందితుడు భార్గవ్ రామ్, గుంటూరు శ్రీనుల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
అపహరణకు ప్రధాన సూత్రధారి అయిన గుంటూరు శ్రీను అతనికి పరిచయం ఉన్న వ్యక్తులను పలు ప్రాంతాల నుంచి రప్పించి... ప్రవీణ్ రావు సోదరుల అపహరణకు పాల్పడ్డాడని పోలీసులు గుర్తించారు. వీరిని సిద్దార్ధ్ సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇతని గ్యాంగ్‌లో ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. సిద్దార్ధ్ కూడా పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం.
భార్గవ్ రామ్ అతని సోదరుడు చంద్రహాస్‌లు యూసఫ్ గూడలోని ఎంజీఎం పాఠశాలలో వీరికి ఐటి అధికారులుగా ఎలా నటించాలో శిక్షణ ఇచ్చారు. ఈ కేసులో భార్గవ్ రామ్ తల్లి కిరణ్మయిని సైతం నిందితురాలిగా గుర్తించిన పోలీసులు వాళ్ల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: అఖిలప్రియ ఫోన్లు ఎక్కడున్నాయి? వాటినెలా స్వాధీనం చేసుకోవాలి?