సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్‌ను అక్రమంగా అరెస్టు చేశారని, ఈ విషయంపై తాము హైకోర్టును ఆశ్రయించామని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. తాము వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కోర్టులో వాదోపవాదాలు జరిగాయని.. వాస్తవాలను కోర్టుకు వివరించామని ఆయన తెలిపారు. ఆరు సంవత్సరాల క్రితం జరిగిన ఘటనకుగానూ గత నెల 27న భూమన్నను అరెస్టు చేయడం కక్ష సాధింపు చర్యే అంటూ మండిపడ్డారు.
ఇదీ చూడండి : 'ప్రజావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తా'