అంబర్ పేట పరిధిలోని గోల్నాకలో... గంగపుత్రులు ఘనంగా భీష్మ ఏకాదశి ఉత్సవాలు నిర్వహించారు. చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకులు రంగరాజన్ ఆధ్వర్యంలో భీష్మపితామహా స్మరణ జరిపించారు. మేళ తాళాలతో డప్పు చప్పుళ్లతో భీష్మ పితామహుడుకి సంగీత కచేరీ నిర్వహించారు.
అనంతరం భీష్ముడి గొప్పతనాన్ని గంగపుత్రులకు వివరించారు. సనాతన సంప్రదాయ మత్స్యకారులు తమ మూలపురుషులను గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. భీష్ముడి ఉపదేశాలను, విష్ణు సహస్రనామాన్ని ఎన్నడూ మరువకూడదని ఆయన హిత బోధ చేశారు. పంచమవేదమైన మహాభారతాన్ని వేదవ్యాసుడు రాసినా, భీష్ముడు అనే పాత్ర లేకపోతే భారతమే లేదనీ తెలంగాణ గంగా గౌరీశ్వర భజన మండలి అధ్యక్షుడు పూస నర్సింహ బెస్త తెలిపారు.
ఇదీ చదవండి:రేపటి నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం: సబిత