ETV Bharat / state

Bhatti Vikramarka VS Harish Rao : దేశానికి వైద్యం అందించే శక్తిగా రాష్ట్రం ఎదుగుతోంది: హరీశ్ రావు - Telangana Assembly interesting scenes

Bhatti Vikramarka VS Harish Rao : తెలంగాణ ఏర్పడిన తరువాత వైద్య రంగంపై రూ.73 వేల కోట్లు కేటాయించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో తెలిపారు. ఈ ఏడాది రూ.12 వేల కోట్లకు పైగా కేటాయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల పని విధానంపై కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క లేవనెత్తిన పలు ప్రశ్నలకు మంత్రి హరీశ్‌ సమాధానం ఇచ్చారు.

Bhatti Vikramarka speech in assembly meetings
Bhatti Vikramarka VS Harish Rao
author img

By

Published : Aug 4, 2023, 9:39 PM IST

Updated : Aug 4, 2023, 10:34 PM IST

Bhatti Vikramarka on Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో వైద్య రంగంపై ఇవాళ వాడీవేడిగా చర్చ జరిగింది. సీల్పీ నేత భట్టి విక్రమార్క వైద్య విద్య, కొత్త ప్రభుత్వ ఆసుపత్రుల అంశం గురించి పలు ప్రశ్నలు లేవనెత్తారు. హైదరాబాద్‌ చుట్టూ ఐదు ఆసుపత్రులు కడతామని హామీ ఇచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. ఒక్కటైనా నిర్మించారా? భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లలో కొత్తగా ఒక్క ఆసుపత్రి కూడా నిర్మించలేదని ఆరోపించారు. తెలంగాణ శాసనసభలో మాట్లాడిన ఆయన.. కేసీఆర్‌ సర్కారు.. బీఆర్‌ఎస్‌ పార్టీకి ఉపయోగపడేవి నిర్మించి.. ప్రజలకు ఉపయోగపడేవి నిర్మించట్లేదని విమర్శించారు.

ఉస్మానియాలో కొత్త భవనం నిర్మించేందుకు ఇంకా ఖాళీ స్థలం ఉందని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భట్టి ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం నామమాత్రంగా మిగిలిందని అభిప్రాయపడ్డారు. ఫీజు బకాయిల వల్ల విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య విద్య ఫీజులు భారీగా పెంచి పేదలకు భారంగా మార్చారని ధ్వజమెత్తారు.

Prashanth Reddy on Crop Compensation : 'పంట నష్టం నివేదిక రాగానే.. ముంపు రైతులందరికీ పరిహారం అందిస్తాం'

Etela Rajender Speech in Assembly 2023 : 'ప్రభుత్వం ఘనంగా ప్రకటిస్తోందే కానీ.. అమలు చేయట్లేదు'

Telangana Assembly Sessions 2023 : ప్రభుత్వ ఆసుపత్రిల్లో వైద్య సేవలు అందించే సిబ్బంది లేరని విమర్శించారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే ఇల్లు, పొలం అమ్ముకునే పరిస్థితి వస్తోందని దుయ్యబట్టారు. అలాగే.. విద్యలో తెలంగాణ చివరి నుంచి ఆరోస్థానంలో ఉందని.. ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే మనకంటే తక్కువ ర్యాంకుల్లో ఉన్నాయని భట్టి విక్రమార్క సభలో వ్యాఖ్యానించారు.

Harish Rao speech on Telangana Assembly : దీనిపై స్పందించిన వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు.. పదేళ్లలో వైద్య రంగానికి రూ.73 వేల కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. వైద్యానికి ఈ ఏడాది రూ.12 వేల కోట్లకు పైగా కేటాయించినట్లు పేర్కొన్నారు. పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాల పేరుతో ప్రాథమిక దశ నుంచి వైద్యం అందిస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వ హయంంలో వైద్యానికి కేటాయించిన నిధులు గురించి వివరించారు.

వైద్యానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని ఆరోపించారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అందించగలుగుతున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి వల్ల పారిశుద్ధ్యం మెరుగుపడిందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.

"పదేళ్లలో వైద్య రంగంపై రూ.73 వేల కోట్లు కేటాయించాం. వైద్యానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.2 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. వైద్యానికి ఈ ఏడాది రూ.12 వేల కోట్లకు పైగా కేటాయించాం. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అందించగలుగుతున్నాం."- హరీశ్‌రావు, వైద్యఆరోగ్యశాఖ మంత్రి

Raj Bhavan on TSRTC Bill : కాస్త టైం కావాలి.. TSRTC బిల్లుపై రాజ్​భవన్ కామెంట్స్

Telangana Assembly on Floods Damage : అసెంబ్లీని కుదిపేసిన వరద నష్టతీవ్రత.. సభలో పరిహారం ప్రకటించాలని విపక్షాల పట్టు

Congress leaders protest : 'వరద బాధితులకు పరిహారం చెల్లించాల్సిందే'

Last Updated : Aug 4, 2023, 10:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.