Bhatti Vikramarka Speech in Monsoon Assembly Sessions 2023 : కాళేశ్వరంలో పంప్ చేసే నీళ్ల కంటే.. వదిలే నీళ్లే ఎక్కువగా ఉన్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శాసన సభ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పాలన లోపాలపై భట్టి విక్రమార్క మాట్లాడారు. గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వాడుకోవడం లేదని ఆరోపించారు. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అధిక ప్రయోజనాలు పొందట్లేదని విమర్శించారు. కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయడం, సముద్రంలోకి వదలడం జరుగుతోందే తప్ప నిల్వ చేయట్లేదని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా పంపు చేసే నీళ్ల కంటే.. బయటకి వదిలే నీళ్లు ఎక్కువ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఏర్పాటు చేసి అదనపు ఆయకట్టు తీసుకురావాలని సూచించారు. ఆయకట్టు తీసుకువస్తే ఎన్ని లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందిస్తారో తెలియజేయాలని అన్నారు. నక్కలగండి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్, లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పనులు సాఫీగా జరగట్లేదని ఆరోపించారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు మందగించాయని.. ఆ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని కోరారు.
Bhatti Vikramarka Discussion on Projects in Telangana : ఉద్దండాపూర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం పరిసరాల్లో 4 తండాలు, ఒక ఎస్సీ ఆవాసం నిరాశ్రయులయ్యారని గుర్తు చేశారు. నిర్వాసితులకు ప్రభుత్వం భరోసా ఇచ్చి ఆదుకోవాలని.. దీంతో పాటు పునరావాసం కల్పించాలని కోరారు. భద్రాచలం మండలం నుంచి ఏపీలో కలిసిన 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని సూచించారు. ఆయా గ్రామాలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.
Bhatti Vikramarka on Telangana Floods : 'వర్షాల వల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి'
Bhatti Vikramarka Suggested Mahila Bandu in Telangana : దళితబంధు, బీసీబంధు సాధ్యమైనంత త్వరగా లబ్దిదారులందరికీ ఇవ్వాలని వెల్లడించారు. మహిళా సాధికారత కోసం మహిళా బంధు ప్రవేశపెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల యూనివర్సిటీలు నిర్వీర్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల నిరుద్యోగం తీవ్రంగా పెరుగుపోతుందని గుర్తు చేశారు. పోలీసుల ఉద్యోగాల భర్తీలో జీవో 47 విషయంలో పునరాలోచన చేయాలని కోరారు. ఈ జీవో వల్ల తెలంగాణ అభ్యర్థులు నష్టపోతున్నారని తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికులు 2 నెలలుగా ఆందోళన చేస్తున్నారని.. వారితో పాటు ఐకేపీ సిబ్బందికి పేస్కేల్ వర్తింప చేయాలని అన్నారు.
"కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయడం, సముద్రంలోకి వదలడం జరుగుతోంది. రాష్ట్రంలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు ఏర్పాటు చేసి అదనపు ఆయకట్టు తీసుకురావాలి. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను వేగంగా పూర్తి చేయాలి. భద్రాచలం మండలం నుంచి ఏపీలో కలిసిన 5 గ్రామాలను తెలంగాణలో కలపాలి. మహిళా సాధికారత కోసం మహిళాబంధు ప్రవేశపెట్టాలి. పోలీసుల ఉద్యోగాల భర్తీలో జీవో 47 విషయంలో పునరాలోచన చేయాలి." - భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
Bhatti Vikramarka on Telangana Govt : 'తెలంగాణలో ఇక సర్కారు జాగాలుండవు.. అన్నీ బీఆర్ఎస్ భూములే'
Bhatti Vikramarka VS Harish Rao : దేశానికి వైద్యం అందించే శక్తిగా రాష్ట్రం ఎదుగుతోంది: హరీశ్ రావు
Bhatti Vikramarka fires on BRS : 'దొరల ప్రభుత్వం వద్దు ప్రజల ప్రభుత్వం తెచ్చుకుందాం'