Bhattivikkamarka response to Sajjala comments: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. విడిపోయిన రెండు రాష్ట్రాలు కలవడం అనేది తిరిగి జరిగేది కాదని ఆయన స్పష్టం చేశారు. సమైఖ్య రాష్ట్ర నినాదమనేది సజ్జల వ్యక్తిగతమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కోరుకున్నందునే కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినట్లు వివరించారు.
సమైఖ్య నినాదం అనేది ఇవాళ కొత్త కాదని.. గతంలో కూడా వాళ్లు అదే మాట్లాడారని తెలిపారు. రాజకీయాలల్లో నిరంతరం కుట్రలు జరుగుతూనే ఉంటాయని, మళ్లీ సెంటిమెంట్‌ను రగిలించడం కుట్రలో భాగమేనని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆలోచనకు భిన్నంగా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. సమైఖ్య రాష్ట్ర నినాదమనేది ఉపయోగం లేనిదని స్పష్టం చేశారు.
Ponnam Prabhakar response to Sajjala comments: అటు సజ్జల వ్యాఖ్యలపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. సమైఖ్య నినాదం ముగిసిన అధ్యాయమని వ్యాఖ్యానించారు. విడిపోయి దాదాపు పది సంవత్సరాలు అయిపోయిన తరువాత ఇప్పుడు తిరిగి సమైఖ్య నినాదాన్ని తెరపైకి తీసుకురావడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్లమెంట్‌లో రాజ్యాంగ బద్ధంగా విడిపోయాయని.. ఇప్పుడు తిరిగి తెలంగాణ మీద దాడి జరిగే అవకాశం ఉందని పొన్నం ఆందోళన వ్యక్తం చేశారు.
సజ్జల వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రంపై కుట్ర జరుగుతున్నట్లుగా అనిపిస్తోందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకోవాలి కానీ.. మళ్లీ తెలంగాణలో రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎందరో ప్రాణ తాగ్యాల వల్ల ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం గురించి మళ్లీ తమ రాజకీయ లబ్ధి కోసం ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడటం ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడమేనని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: