ETV Bharat / state

'ప్రజల కలలు నిజం చేయడమే ఇందిరమ్మ ప్రజాపాలన లక్ష్యం - అప్పుల రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాం'

Bhatti Vikramarka on Congress One Month Ruling : ప్రజల కలలు నిజం చేయడమే ఇందిరమ్మ ప్రజాపాలన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో విర్ర వీగకుండా సేవకుడిగా పని చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధికి నిరంతరం పని చేస్తానని చెప్పారు. ఈ మేరకు నెల రోజుల కాంగ్రెస్ పాలనపై భట్టి విక్రమార్క స్పందించారు.

Bhatti Vikramarka on Congress One Month Ruling
Bhatti Vikramarka
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2024, 1:25 PM IST

Bhatti Vikramarka on Congress One Month Ruling : తెలంగాణ ప్రజలు పెట్టుకున్న కలలను నిజం చేయడంతో పాటు వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పనిచేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుందని, అప్పుల ఊబి నుంచి గట్టెక్కించి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని ఆయన తెలిపారు.

గత ప్రభుత్వ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, అప్పుల ఊబిలోకి నెట్టినప్పటికీ ఉద్యోగులకు 2వ తేదీన జీతాలు తమ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రం అప్పుల పాలైనప్పటికీ తెలంగాణ ప్రజల కలలు నిజం చేయడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చిన వాటిని అధిగమించి సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నెల రోజుల పాలనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వం ప్రతి శాఖను అప్పుల్లో ముంచింది : డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka on Congress Government : రాష్ట్రంలోని సహజ వనరులు, ఇతను వనరులను రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లి సంపద సృష్టించి ప్రజలకు పంచడమే లక్ష్యంగా పనిచేస్తామని భట్టి పేర్కొన్నారు. అదేవిధంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి నిష్ణాతులతో మాట్లాడడానికి తనకు ఎలాంటి భేషజాలాలు లేవని, రాజ్యాంగం, ఫెడరలిజం స్ఫూర్తితో రాష్ట్రానికి రావలసిన ఆదాయ వనరులను కేంద్రం నుంచి రాబట్టుకోవడానికి ముందుకు వెళ్తామని భట్టి తెలిపారు.

రాష్ట్ర విభజన చట్టాల హామీలు అమలు కోసం కేంద్రానికి విన్న విస్తామని, ఎలాంటి భేషజాలాలకు పోకూండా ఎన్నికలప్పుడే రాజకీయాలు తప్పా, ఇప్పుడు పాలన అభివృద్ధి ముఖ్యమని వెల్లడించారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం అందరి సమిష్టి బాధ్యతతో ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ తన కోసమే ఏర్పాటు చేశారని ప్రతి పౌరుడు అనుకునే విధంగా తమ పరిపాలన సాగుతుందని భట్టి విక్రమార్క వివరించారు.

మాది దొరల సర్కార్ కాదు, ప్రజా ప్రభుత్వం : డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka on Finance Department : మరోవైపు ఇటీవల అర్థిక శాఖపై సమీక్ష నిర్వహించిన భట్టి విక్రమార్క రాష్ట్రం ఐదున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని వెల్లడించారు. అయినప్పటికీ ​ఆర్థిక శాఖ బాధ్యతలను సవాల్​గా తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, అభయ హస్తం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చేలా ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అధికారులు మనస్ఫూర్తిగా పనిచేయాలని ఆయన కోరారు. భుత్వ విజయం ఆర్థిక శాఖపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగస్తుల్లా కాకుండా రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నామన్న చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా విధులు నిర్వర్తిస్తే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని దేవాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం : భట్టి విక్రమార్క

గ్యారంటీల అమలు జరిగేలా బడ్జెట్ రూపకల్పన కోసమే ప్రజాపాలన దరఖాస్తులు : భట్టి విక్రమార్క

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.