Bhatti Vikramarka: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంజాబ్‌లో చేసిన నాటకం ఆయన పదవిని దిగదార్చే విధంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. దళిత ముఖ్యమంత్రిని ఫెయిల్యూర్‌గా చూపెట్టడానికి భాజపా నాటకాలాడుతోందని మండిపడ్డారు. అంతే కాకుండా పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 371డీని పరిశీలించాలని కేంద్రప్రభుత్వానికి సీఎల్పీ నుంచి లేఖ రాస్తున్నట్లు భట్టి తెలిపారు.
నష్టపరిహారం అందించాలి..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. పసుపు, మిర్చి పంటలకు కూడా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య దయనీయ పరిస్థితిలో ఉందన్నారు. పోలీసు యంత్రాంగాన్ని అధికార పార్టీ తన క్యాడర్‌గా మార్చుకుందని దుయ్యబట్టారు. సీఎల్పీ బృందం గవర్నర్‌తో పాటు డీజీపీని కలవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో రాజీనామా చేయించి సస్పెండ్ చేయాలని సీఎల్పీ డిమాండ్ చేస్తుందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచితే పోరాటం చేస్తామన్నారు.
పంజాబ్‌లో మోదీ డ్రామా..
పంజాబ్‌లో మోదీ డ్రామా ఆయన స్థాయిని దిగజార్చేలా ఉంది. దళిత సీఎం వైఫల్యంగా చూపెట్టేందుకే భాజపా డ్రామా. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తున్నారు. 371డి పరిశీలించాలని కేంద్రానికి సీఎల్పీ తరఫున లేఖ రాస్తున్నాం. ధాన్యం కొనుగోలుపై కేంద్రం, రాష్ట్రం కలిసి నాటకమాడాయి. పసుపు, పత్తి, మిర్చి రైతులకు పరిహారం అందించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే. -భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
ఇదీ చదవండి: