Covaxin Booster Dose : రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారితో పోలిస్తే బూస్టర్ డోసు తీసుకున్న వారిలో డెల్టాని నిలువరించే యాంటీబాడీల వృద్ధి ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందని భారత్ బయోటెక్ ప్రకటించింది. బూస్టర్ డోసుపై చేసిన ప్రయోగాలకు సంబంధించి వివరాలను శనివారం విడుదల చేసింది. 90 శాతం మందిలో తీవ్రమైన కొవిడ్ స్ట్రెయిన్‌లను సైతం నిలువరించే శక్తిగల యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది.
రెండో డోస్ తీసుకున్న 6 నెలల తరువాత బూస్టర్ డోస్ తీసుకోవచ్చని తెలిపింది. బూస్టర్ డోసు తీసుకున్నవారిలో టి, బి సెల్ రెస్పాన్స్ గుర్తించామని తెలిపింది. బూస్టర్ డోసు తీసుకోవడం ద్వారా ఎక్కువ కాలం పాటు తీవ్ర కొవిడ్ నుంచి రక్షణ పొందొచ్చని పేర్కొంది. బూస్టర్డోసుపై జరిపిన ప్రయోగాల్లో సత్ఫలితాలు రావడం పట్ల భారత్ బయోటెక్ ఛైర్మెన్ డాక్టర్ కృష్ణా ఎల్లా హర్షం వ్యక్తం చేశారు.
-
Covaxin Booster Dose
— BharatBiotech (@BharatBiotech) January 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Safe and Highly Immunogenic (against all variants) #covaxin #BharatBiotech #COVID19Vaccine #COVID19 #boosterdose #SARS_CoV_2 pic.twitter.com/JpwszpWcDj
">Covaxin Booster Dose
— BharatBiotech (@BharatBiotech) January 8, 2022
Safe and Highly Immunogenic (against all variants) #covaxin #BharatBiotech #COVID19Vaccine #COVID19 #boosterdose #SARS_CoV_2 pic.twitter.com/JpwszpWcDjCovaxin Booster Dose
— BharatBiotech (@BharatBiotech) January 8, 2022
Safe and Highly Immunogenic (against all variants) #covaxin #BharatBiotech #COVID19Vaccine #COVID19 #boosterdose #SARS_CoV_2 pic.twitter.com/JpwszpWcDj
ఇదీ చూడండి: Corona Vaccination In Telangana: తెలంగాణలో 100 శాతం మందికి కరోనా టీకా తొలిడోస్ పూర్తి!