Suchitra Ella on Fourth wave: కరోనా మొదటి, రెండు దశల్లో మాత్రం ఇబ్బందులు పడ్డామని భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా తెలిపారు. దేశంలో ఎక్కువ శాతం వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కొవిడ్ నుంచి రక్షణ పొందుతున్నామన్నారు. బూస్టర్ డోస్ సైతం అందరికి అందుబాటులో రావడం చాలా మంచిందన్నారు. ప్రభుత్వ, ప్రజల సహకారంతో కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. ఫోర్త్ వేవ్ ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆమె వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అందరం అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చిన తట్టుకోవాలంటే వ్యాధి నిరోధక శక్తితో పాటు ప్రజల సహకారం ఉండాలని సుచిత్ర ఎల్లా తెలిపారు.
హైదరాబాద్ మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రముఖ చిత్రకారుడు భాస్కర్‌రావు ఏర్పాటు చేసిన చిత్ర కళా ప్రదర్శనను భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా ప్రారంభించారు. వృక్షం పేరుతో భాస్కర్‌రావు ఏర్పాటు చేసిన చిత్రకళ ప్రదర్శనను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని ఆమె అన్నారు. చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఆరోగ్యంపై ప్రతి ఒక్కరు శ్రద్ధ చూపాలని ఆమె సూచించారు. తెలియడం వలన చిన్నారులను, పెద్దలను కాపాడుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారుడు లక్ష్మణ్ గౌడ్, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మితో పాటు పలువురు చిత్రాకారులు పాల్గొని భాస్కర్‌రావును అభినందించారు. వ్యాక్సిన్ ఈ ప్రదర్శనలో వృక్షాలపై వేసిన 75 చిత్రాలు కళా ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రదర్శన ఈనెల 19వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వహకులు తెలిపారు.
ఇవీ చదవండి: ఆరుగురిలో ఓ నిందితుడు పరారీ.. ఆస్పత్రిలో పోలీసుల కళ్లుగప్పి..!
'మహా'లో తగ్గిన కేసులు.. దిల్లీలో 4.11శాతానికి పాజిటివిటీ రేటు