Bhagyanagar Ganesh Utsava Samiti: గణేశ్ ఉత్సవాలపై ప్రభుత్వం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోందని.. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. గణేశుని ఉత్సవాలు జయప్రదం చేయడం కోసం ప్రభుత్వం కలిసిరావాలని కోరారు. ఈ నెల 9న గణేశ్ నిమజ్జనం నిర్వహించాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్ణయించిందని వివరించారు. హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. గణపతి నిమజ్జనంపై నిర్వాహకులను పోలీసులు ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ ఉత్సవాల్లో ఎలాంటి అపశ్రుతి జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. కొంతమంది పోలీసులు శుక్రవారం నిమజ్జనం లేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
'ఈ నెల 9న గణేశ్ నిమజ్జనం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. అనంత చతుర్దశి కాబట్టి శుక్రవారమే నిమజ్జనం చేయాలి. కొంతమంది పోలీసులు శుక్రవారం నిమజ్జనం లేదని ప్రచారం చేస్తున్నారు. గణేశ్ విగ్రహాలను చెత్తలో పడేస్తున్నారు. ఎలాంటి అపశ్రుతి జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి.' -భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి
ఇవీ చదవండి: