Best Street Foods in Hyderabad With Super Taste: హైదరాబాద్ బిర్యానీ మొదలు.. ఫుల్ ఫేమస్ అయిన మన భాగ్యనగర వంటకాలు చాలానే ఉన్నాయి. ఇక్కడ పుట్టిన ఎన్నో వంటకాలు.. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. అయితే.. అవన్నీ రెస్టారెంట్ మేడ్. కానీ.. హైదరాబాద్‌లోని స్ట్రీట్ ఫుడ్స్ కూడా అంతకు మించి అనేలా ఉంటాయి.
"భయ్యా.. ఏక్ ప్లేట్ పానీ పూరీ.." నుంచి.. "ఛోటు.. దో చాయ్" దాకా.. ఎన్నో డైలాగులు హైద్రాబాద్ రోడ్లవెంట నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి ఆర్డర్స్ మీరు కూడా ఎన్నోసార్లు వేసి ఉంటారు. మరి, ఆ లిస్టులో ఇవి ఉన్నాయో లేదో.. ఓసారి చెక్ చేయండి. "లేదు" అంటే మాత్రం.. ఈ సారి తప్పకుండా ట్రై చేయండి. భాగ్యనగరంలో లభించే.. 8 రకాల బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ లిస్టును మీకోసం అందిస్తున్నాం.
Chaat and Pav Bhaaji(చాట్ అండ్ పావ్ భాజీ)
Dosa( దోసె)
Mirchi bajji & Manchuria(మిర్చి బజ్జీ అండ్ మంచూరియా)
Pesarattu Dosa(పెసరట్టు దోసె)
Maggie Point(మ్యాగీ )
Double ka Meetha(డబల్ కా మీఠా)
Keema Samosa (కీమా సమోసా)
Hyderabadi Biryani(హైదరాబాద్ బిర్యానీ)
1. చాట్ అండ్ పావ్ భాజీ(Chat and Pav Bhaaji): చాట్ అండ్ పావ్ భాజీలకు హైదరాబాద్ ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గోకుల్ ఛాట్, బేగమ్ బజార్ మొదలు.. భాగ్యనగరం మొత్తం ఛాట్ ఘుమఘుమలు విస్తరించి ఉంటాయి. ప్రతీ హైదరాబాదీ కచ్చితంగా ఒక్కసారైనా ఛాట్ తినే ఉంటాడంటే అతిశయోక్తి కాదు.
2. దోసె (Dosa) : దోసె అనేది అందరి ఇళ్లలో.. రోజువారీ బ్రేక్ఫాస్ట్ల్లో భాగమే. కానీ.. టిఫెన్ సెంటర్ల దగ్గర చేసే దోసెలో ఉన్న టేస్ట్.. ఇంట్లో రాదు. అందుకే.. జిహ్వ చాపల్యాన్ని చల్లార్చుకునేందుకు.. ప్రతి ఒక్కరూ కుదిరినప్పుడల్లా టిఫెన్ సెంటర్లో ఆర్డర్ వేస్తుంటారు.నోరూరించే హైదరాబాద్ సబ్జీ దమ్‌కీ బిర్యానీ
3. మిర్చి బజ్జీ అండ్ మంచూరియా :
Mirchi and Manchurian : ప్రతీ ఒక్కరి ఈవెనింగ్ స్నాక్స్‌లో మిర్చి బజ్జీకి ప్రత్యేక స్థానం ఉంటుంది. వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి బజ్జీలు తింటుంటే ఆ ఫీలింగే వేరు. అయితే.. మిర్చి బజ్జీ, మంచూరియా వాసనలతో భాగ్యనగర వీధులు సాయంత్రం వేళల్లో ఘుమఘుమలాడుతాయి.
4.పెసరట్టు దోసె(Pesarattu Dosa): దోసెలలో పెసరట్టు దోసెలకు స్పెషల్ లవర్స్ ఉంటారు. తెలుగులో అట్టు అంటే క్రేప్, పెసర అంటే మూంగ్ దాల్ (పచ్చి పప్పు). ఈ రెండింటిని కలిపి వేస్తేనే పెసరట్టు అవుతుంది. అయితే.. ఇది కేవలం బ్రేక్‌ఫాస్ట్‌లాగా కాకుండా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది.
5. మ్యాగీ పాయింట్ (Maggie Point): హైదరాబాద్ స్నాక్స్ లిస్టులో.. మ్యాగీ కూడా ఉంటుంది. ఇది అన్ని ప్రాంతాలలో లేదు. కొన్ని చోట్ల మాత్రమే లభిస్తుంది. గచ్చిబౌలి ఫేమస్ అడ్డా. హైటెక్ సిటీ పరిధిలోని సాఫ్ట్వేర్స్ ఎంప్లాయీస్ ఓ పట్టు పడుతుంటారు. రాత్రి 9 గంటల తర్వాత అక్కడికి వెళ్తే.. విపరీతమైన రద్దీ ఉంటుంది.
6. డబల్ కా మీఠా(Double Ka Meetha): ఈ స్వీట్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. హైదరాబాద్‌లో జరిగే అన్ని వేడుకల్లో తప్పకుండా దీనిని వడ్డిస్తుంటారు. ఇది ఒక రకమైన బ్రెడ్ పుడ్డింగ్. దీనిలో బ్రెడ్ ముక్కలను కుంకుమపువ్వు(సాఫ్రన్), ఇలాచీ కలిపిన పాలలో నానబెట్టి, తరువాత రోస్ట్ చేస్తారు. ఇలా తయారు చేసిన తర్వాత ఇది అదిరిపోయే రుచిని ఇస్తుందంటే నమ్మాల్సిందే.
7. కీమా సమోసా(Keema Samosa): సాధారణంగా చాలా మంది ఆనియన్ సమోసా.. ఆలు సమోసా తింటూ ఉంటారు. అవి తిని బోర్ కొట్టిన వాళ్లు కీమా సమోసాను ట్రై చేస్తుంటారు. హైదరాబాద్‌లో మాత్రమే దొరికే ఈ కీమా సమోసా టేస్ట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. స్పైసీ మసాలాలు, మటన్ కీమాతో తయారుచేస్తారు. హైదరాబాద్ వీధుల్లో ఇది చాలా రుచికరమైన స్నాక్. వర్షం కురుస్తున్న రోజున, కేవలం కప్పు ఇరానీ చాయ్‌తో కీమా సమోసాను జత చేసి తింటే.. టేస్ట్ సూపర్ అంతే..!
8. అల్టిమేట్ హైదరాబాదీ బిర్యానీ(Hyderabadi Biryani): హైదరాబాదీ బిర్యానీకి ఈ లిస్టులో చోటు ఎందుకు ఇచ్చామంటే.. ఇది కూడా ప్రతీ స్ట్రీట్‌లో లభిస్తుంది మరి..! పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా.. మరొకరికి చోటు ఉన్నట్టే.. హైదరాబాద్ లో ఎన్ని బిర్యానీ సెంటర్లు పెట్టినా.. కొత్తవాటికి స్థానం ఎల్లప్పుడూ ఉంటుంది. అంతగా.. హైదరాబాదీ బిర్యానీని ఆస్వాదిస్తుంటారు నగర వాసులు.