నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ పెరిగి సమాచార మార్పిడి శరవేగంగా జరిగిపోతోంది. ఎన్నో రకాల ప్రసారమాధ్యమాలు అందుబాటులో ఉండడం వల్ల ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో అందరికీ చేరిపోతుంది. కానీ ఒకప్పుడు ప్రతీది పోస్ట్‌మ్యాన్ తెచ్చిచ్చే కార్డు ముక్క ద్వారానే ఒకరి విషయాలు ఒకరికి తెలిసేది.
అయితే ఇప్పటికీ కొన్ని కార్యకలాపాలు పోస్ట్‌ల ద్వారానే జరుగుతుంటాయి. కాగా ప్రస్తుతం కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా పోస్ట్మ్యాన్లు తమ సేవలను అందించారు. వారి సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ ప్రతిభ కనబరిచిన హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్ పరిధిలోగల కాచిగూడ పోస్ట్‌మ్యాన్ చేగురి పురుషోత్తం బెస్తను 'బెస్ట్ పోస్ట్‌మ్యాన్'గా ప్రకటిస్తూ సౌత్ ఈస్ట్ డివిజన్ సూపరింటెండెంట్ అతనికి అవార్డుతోపాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
ఇదీ చూడండి: బ్యాంకుల తరహాలో తపాలా సేవలు.. ఆర్‌బీఐ అనుమతి కోరిన పోస్టల్‌శాఖ