ETV Bharat / state

వ్యవసాయ భూముల్లో సౌర విద్యుత్‌ప్లాంట్లతో రైతన్నకు లాభం - వ్యవసాయ భూముల్లో సోలార్​ ప్లాంట్ల వార్తలు

సాగు భూములను వ్యవసాయంతో పాటు సౌరవిద్యుత్తు ఉత్పత్తికి అనువుగా మలచుకుంటే రైతులు మరింత ఆదాయం పొందవచ్చని నేషనల్‌ సోలార్‌ ఎనర్జీ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌ఎస్‌ఈఎఫ్‌ఐ) సీఈవో సుబ్రహ్మణ్యం పులిపాక చెబుతున్నారు. దేశంలో ఉత్పత్తవుతున్న సౌరవిద్యుత్తులో తెలుగురాష్ట్రాల వాటా 15 శాతం. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని సుబ్రహ్మణ్యం అన్నారు.

solar power plants on agricultural lands solar power plants on agricultural lands
వ్యవసాయ భూముల్లో సౌర విద్యుత్‌ప్లాంట్లతో రైతన్నకు లాభం
author img

By

Published : Oct 7, 2020, 9:34 AM IST

విదేశాల్లో ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్న సాగు భూముల్లో సౌరవిద్యుత్తు ఉత్పత్తి ప్రక్రియ మన దేశంలో ప్రయోగదశలో ఉంది. 'ఆగ్రో ఫొటో వోల్టాయిక్‌'గా పేర్కొనే ఈ విధానంపై పరిశోధన చేస్తున్న నేషనల్‌ సోలార్‌ ఎనర్జీ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌ఎస్‌ఈఎఫ్‌ఐ) సంస్థ, కేంద్రానికి రెండు నెలల్లో తమ ప్రతిపాదనలను అందించనుంది. విధానం పూర్వాపరాలను సంస్థ సీఈవో సుబ్రహ్మణ్యం 'ఈనాడు-ఈటీవీభారత్​'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

ముఖ్యాంశాలు..

దేశంలో ఉత్పత్తవుతున్న సౌరవిద్యుత్తులో తెలుగురాష్ట్రాల వాటా 15 శాతం. తెలంగాణ 4, ఆంధ్రప్రదేశ్‌ 5 స్థానాల్లో ఉన్నాయి. సాగును, సోలార్‌ ప్రాజెక్టులను కలిపి చేపడితే రైతు మరింతగా లాభపడతాడు. ప్రభుత్వానికి ఆదాయమూ లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలి.

పంటల విషయానికొస్తే...

  • కలబంద(అలొవెరా), నిమ్మగడ్డి, సుగంధ ద్రవ్యాలు, ఔషధమొక్కలు, ఆకుకూరలు, పండ్లు ఈ ప్యానెళ్ల కింద పండించవచ్చు. ప్యానళ్లను బాగా ఎత్తుగా ఉంచితే ఆవాల వంటివీ వేసుకోవచ్చు. చైనా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ వంటి దేశాల్లో కాలీఫ్లవర్‌, క్యాబేజి, ద్రాక్ష వంటివి సాగుచేస్తున్నారు.
  • భూములు మాదిరిగానే ప్లాంటునూ కౌలుకివ్వవచ్చు. అలా కూడా రైతుకు ఆదాయం లభిస్తుంది.

ఏమిటీ విధానం?

  • ఇప్పటి వరకూ వ్యవసాయేతర, బీడుభూముల్లో మాత్రమే సౌరవిద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా ఒకటి నుంచి ఒకటిన్నర అడుగుల ఎత్తున సోలార్‌ ప్యానల్‌ ఉంటుంది. ఆగ్రో ఫొటో వోల్టాయిక్‌ విధానంలో.. సాగుభూముల్లో మూడు నుంచి నాలుగడుగుల ఎత్తున ప్యానల్‌ ఏర్పాటుచేసి సౌరవిద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. పంటలనూ పండిస్తారు. తద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. రైతు తాను వాడుకున్న విద్యుత్తును మినహాయించుకొని మిగిలింది గ్రిడ్‌కు పంపి ఆదాయం పొందవచ్చు. సౌరవిద్యుత్తు పర్యావరణహితం, కాలుష్యరహితమైంది కావటం అదనపు ప్రయోజనం. ఈ విధానంలో విద్యుత్తు ఉత్పత్తికి పెద్దగా ఖర్చు కూడా కాదు. ప్యానల్స్‌ శుభ్రం చేసిన నీటిని దిగువనున్న పంటకూ వినియోగించవచ్చు.
  • సౌరవిద్యుత్తుపై దృష్టిపెట్టిన ప్రభుత్వం ఇప్పటికే ప్రధాన మంత్రి కిసాన్‌ ఉర్జా సురక్షా ఏవం ఉత్థాన్‌ (పీఎం-కుసుం) పథకం కింద వచ్చే మూడేళ్లలో 20 లక్షలకు పైగా ఆఫ్‌గ్రిడ్‌, 15లక్షలకు పైగా ఆన్‌గ్రిడ్‌ పంపుల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే పథకం కింద ప్రభుత్వం ఆగ్రో వోల్టాయిక్‌ను ప్రోత్సహిస్తోంది.
  • కేంద్రం 2022 నాటికి 100... 2030 నాటికి 350 గిగావాట్ల సౌరవిద్యుత్తు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయభూములను వినియోగించుకుంటే వేగంగా దీన్ని సాధించవచ్చు. మెగావాట్‌ సోలార్‌ పవర్‌ ఉత్పత్తికి 4 ఎకరాలు, గిగావాట్‌కు 4వేల ఎకరాల భూమి అవసరమవుతుంది.

ఫెడరేషన్‌ అధ్యయనం

జర్మనీ సహకారంతో ఆగ్రో ఫొటోవోల్టాయిక్‌పై అధ్యయనం చేశాం. ఒక్క శాతం వ్యవసాయభూములను ఈ విధానంలో ఉపయోగించుకుంటే 350 గిగావాట్ల సౌరవిద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని తేలింది. సమర్థ విధానాల అమలుకు మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉన్నాం. పది, పన్నెండుచోట్ల ప్రయోగాత్మకంగా చేసి చూస్తున్నాం. జోథ్‌పూర్‌లోని సెంట్రల్‌ ఎరిడ్‌ జోన్‌ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ వంగ, పొట్ల, బెండ, దోస వంటి కూరగాయలతో పాటు కలబంద తదితరాలనూ సాగుచేస్తోంది. కొన్ని వ్యాపార సంస్థలు సైతం ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి తెలంగాణలోని తాండూరులో మహేంద్ర సంస్థ ఒక ప్లాంటు నిర్వహిస్తోంది.

ఇదీ చదవండిః ఏడు నెలల తర్వాత తిరిగి ప్రారంభమైన నెహ్రు జూలాజికల్‌ పార్క్‌

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.