ETV Bharat / state

'ఆమెకు క్షమాపణలు చెప్పి... కార్యాలయాన్ని తిరిగి నిర్మించండి' - కంగనా రనౌత్​కు మద్ధతు

కంగనాకు క్షమాపణ చెప్పి... కూల్చివేసిన కార్యాలయాన్ని తిరిగి నిర్మించాలని శ్రీ రాష్ట్రీయ రాజపుత్​ కర్ణి సేన డిమాండ్ చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కంగనాపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. మహిళలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఇలా చేయడం సరికాదంటూ మండిపడ్డారు.

begumpet-karni-sena-support-to-kangana-ranaut-at-hyderabad
'ఆమెకు క్షమాపణలు చెప్పి... కార్యాలయాన్ని తిరిగి నిర్మించండి'
author img

By

Published : Sep 14, 2020, 7:47 AM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ వివాస్పద మృతిపై నటి కంగనా రనౌత్ స్పందిస్తున్న తీరుకు... హైదరాబాద్ బేగంబజార్​కు చెందిన శ్రీ రాష్ట్రీయ రాజపుత్ కర్ణి సేన మద్దతు పలికింది. మహారాష్ట్ర ప్రభుత్వం కంగనాపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని వారు మండిపడ్డారు.

దీనిలో భాగంగా కర్ణి సేన దేశ వ్యాప్తంగా కంగనాకు మద్దతుగా కార్యక్రమాలు చేపట్టింది. కంగనాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రావత్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. మహిళలకు మద్దతుగా ఉండాల్సిన ప్రభుత్వం... ఆమెపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే శివసేన ప్రభుత్వం ఆమెకు క్షమాపణ చెప్పి... కూల్చివేసిన కార్యాలయాన్ని తిరిగి నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: మహారాష్ట్ర గవర్నర్​తో నటి కంగన భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.