ETV Bharat / state

ఎన్నికల హామీలను నెరవేరుస్తా : శంకర్ యాదవ్​ - బేగం బజార్​ భాజపా అభ్యర్థి విజయోత్సవ పాదయాత్ర

గ్రేటర్​ ఎన్నికల్లో గెలుపొందిన బేగంబజార్​ భాజపా అభ్యర్థి శంకర్​ యాదవ్​ డివిజన్​ పరిధిలో పాదయాత్ర చేపట్టారు. తనపై మరోసారి నమ్మకం ఉంచినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.

begum bazar bjp candiadate voctory celebrations in his division
ఎన్నికల హామీలను నెరవేరుస్తా : శంకర్ యాదవ్​
author img

By

Published : Dec 8, 2020, 4:43 PM IST

అభివృద్ధిలో ఆదర్శంగా బేగంబజార్​ను తీర్చిదిద్దుతానని భాజపా అభ్యర్థి శంకర్​ యాదవ్​ అన్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. డివిజన్ పరిధిలో విజయోత్సవ పాదయాత్ర నిర్వహించారు.

ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. భాజపాకు మద్దతుగా నిలిచిన కొందరు వ్యాపారులను తెరాస శ్రేణులు బెదిరించడం మంచిది కాదని హితవు పలికారు.

ఇదీ చూడండి:'రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాటం చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.