లాక్డౌన్ కొనసాగుతున్నందున హైదరాబాద్లో నిరుపేదలకు సకాలంలో ఆహార పదార్థాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు బేగంబజార్లోని బంకజ్ భాటియా, రాజేశ్ సింగ్ వ్యాపారులు పేదప్రజలకు నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నారు. 20 రోజులకు సరిపడే 10 కేజీల బియ్యంతో పాటు పప్పు, నూనె, చింతపండు తదితర వస్తువులను వివిధ బస్తీవాసులకు అందజేస్తున్నారు.
ప్రతి ఒక్కరూ... సేవాభావంతో పేద వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని వ్యాపారస్థులు కోరారు. ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్కు తమ వ్యాపారస్తులు మద్దతిస్తూ... పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
ఇదీ చూడండి: నిబంధన అతిక్రమిస్తే చలానా ఇంటికొస్తుంది: డీజీపీ