ఆంధ్ర ఊటీ అరకులోయ పర్యటకులతో సందడిగా మారింది. సంక్రాంతి సెలవుల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులతో లోయ మరింత అందంగా మారింది. కొండ కోనల్లోంచి జాలువారె జలపాతల కింద స్నానాలు చేస్తూ జనం కేరింతలు కొడుతున్నారు. బోట్ షికారు, గిరిజన మ్యూజియం, కాఫీ మ్యూజియం, కాఫీ తోటలు, వ్యూ పాయింట్, జలపాతాలు అన్నీ సందర్శకులతో నిండిపోయాయి. అరకు వెళ్లే రహదారులన్ని రద్దీగా మారాయి.
ఇవీ చూడండి: 'తెరాస మోసాలే... పుర ఎన్నికల్లో మన అస్త్రాలు'