బీసీ కార్పొరేషన్ రుణాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో చేపట్టిన నిరాహారదీక్షను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రారంభించారు. కరోనా వల్ల చేతి, కులవృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని కృష్ణయ్య అన్నారు. కుల వృత్తిని కోల్పోయిన ప్రతి కుటుంబానికి ప్రతి నెల 20వేల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి కూల్చివేయడం తప్ప... బతుకులు నిలబెట్టడం తెలియదని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. బీసీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న 5,77,000 మందికి వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జనాభాలో 50 శాతంపైగా ఉన్న బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆరోపించారు. బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: కొనసాగుతున్న సచివాలయ భవనాల కూల్చివేత