ETV Bharat / state

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి : ఆర్​.కృష్ణయ్య - రిజర్వేషన్లపై ఆర్. కృష్ణయ్య వ్యాఖ్యలు

ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల నుంచి ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. జనాభాలో 91 శాతం ఉన్నవారికి రిజర్వేషన్లలో అన్యాయం జరుగుతోందన్నారు. హైదరాబాద్​ బషీర్​బాగ్​లోని దేశోద్ధారక భవన్​లో అఖిల భారత గిరిజన సమాఖ్య జాతీయ అధ్యక్షుడు గగ్గులోతు వెంకయ్య నాయక్​ నిర్వహించిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

bc welfare national president  r krishnaiah comments on reservations in the state in hyderabad
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలి : ఆర్​.కృష్ణయ్య
author img

By

Published : Jan 25, 2021, 3:13 PM IST

దేశంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయకపోవడం అత్యంత దౌర్భాగ్యమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల సాధన కోసం ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరముందని తెలిపారు. జనాభాలో 91 శాతం ఉన్నావారికి అన్యాయం జరుగుతోందన్నారు. హైదరాబాద్​ బషీర్​బాగ్​లోని దేశోద్ధారక భవన్​లో అఖిల భారత గిరిజన సమాఖ్య జాతీయ అధ్యక్షుడు గగ్గులోతు వెంకయ్య నాయక్​ నిర్వహించిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

జనాభాలో 9 శాతం ఉన్న ఓసీలకు మాత్రం 10 శాతం రిజర్వేషన్లు ఎలా కేటాయిస్తారని ఆయన ప్రశ్నించారు. గిరిజనులకు మాత్రం ఆరు నుంచి పది శాతం రిజర్వేషన్ల పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. రిజర్వేషన్లపై ప్రశ్నించిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం దాటవేయడాన్ని ఆయన తప్పుపట్టారు. గిరిజనులకు గురుకుల పాఠశాలలు పెంచి ప్రతి జిల్లాకు ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో విత్తన రాయితీ పూర్తిగా కనుమరుగైంది: జీవన్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.