ETV Bharat / state

తరగతుల ప్రారంభంపై అధికారులతో మంత్రి గంగుల సమీక్ష - తెలుగు వార్తలు

ఈనెల 25వ తేదీలోగా వసతిగృహాలు, గురుకులాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. విద్యాసంస్థల్లో తరగతులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

తరగతుల ప్రారంభంపై అధికారులతో మంత్రి గంగుల సమీక్ష

author img

By

Published : Jan 12, 2021, 3:24 PM IST

వచ్చే నెల నుంచి విద్యాసంస్థల్లో తరగతులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం నేపథ్యంలో... బీసీ వసతిగృహాలు, గురుకులాల నిర్వహణపై అధికారులతో మంత్రి గంగుల కమలాకర్​ సమీక్షించారు. ఈ నెల 25లోగా వసతి గృహాలలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వంట సామగ్రి, ఇతర ఏర్పాట్లు తక్షణమే చేయాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: జనగామ మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.