చట్టసభల్లో 50 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం మిలిటెంట్ తరహా పోరాటాలు చేసేందుకు బీసీలు సిద్ధం కావాలని... బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య కోరారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాలు చేస్తుంటే పాలకులు పట్టించుకోవడం లేదని... తమ హక్కులను సాధించుకునే దిశగా బీసీలు ఐక్యం కావాలన్నారు. హైదరాబాద్ నారాయణగూడలో బీసీ సంఘాలతో సమావేశమైన ఆయన.. 74 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా పాలకులు చూస్తున్నారని మండిపడ్డారు. అగ్రకులాలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో ఉన్న శ్రద్ధ... 56 శాతం ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడంలో ఎందుకు లేదని ప్రశ్నించారు.
పార్లమెంటులో బిల్లును ప్రవేశపెడితే ఆమోదం చేసే బాధ్యత తాము తీసుకుంటామని కృష్ణయ్య పేర్కొన్నారు. చట్టసభల్లో 50 శాతం బీసీ రిజర్వేషన్లు , కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ డిమాండ్లపై త్వరలో రాష్ట్ర రాజధానిలో 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ సభకు సన్నాహకంగా ఈ నెల 9న లక్డీకపూల్లో సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో పార్టీలకు, సంఘాలకు అతీతంగా నాయకులు పాల్గొనాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: ఎన్నికల్లో తెరాస అధికార దుర్వినియోగం: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్