పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 14 ఏళ్లుగా క్షేత్రస్థాయి సహాయకులుగా విధులు నిర్వహిస్తున్న వారిని అలాగే కొనసాగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపారు. తమ హక్కు కోసం సమ్మె చేస్తే విధుల నుంచి తొలగిస్తారా అని కృష్ణయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రశ్నించారు.
14 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని ఎలాంటి సమాచారం లేకుండా ఏకపక్షంగా తొలగించడాన్ని తప్పుబట్టారు. గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేసే 7,710 ఫీల్డ్ అసిస్టెంట్లలో.. 99 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్సీ ఉద్యోగులున్నారని.. వెంటనే ప్రభుత్వం వీరందర్ని విధుల్లోకి తీసుకోవాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమబాట పడతానని హెచ్చరించారు.