రాష్ట్రంలోని 47 బీసీ కుల సంఘాల మద్దతు నాగార్జునసాగర్ తెరాస అభ్యర్థి నోముల భగత్‌కు ప్రకటిస్తున్నట్లు... బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ నారాయణగూడలో నిర్వహించిన సమావేశంలో... సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, తెలంగాణ నిరుద్యోగ ఐకాస నీలా వెంకటేష్ తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో తెరాస నుంచి బీసీ అభ్యర్థి నోముల భగత్ పోటీ చేస్తున్నందున... ఆయనను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని సంఘాల నాయకలతో కలిసి చర్చించుకుని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆయన విజయం సాధించే దిశగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీసీపై ఉందన్నారు.
ఇదీ చదవండి: 'మరో ఆర్నెళ్లలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణం పూర్తి'