ETV Bharat / state

BC MLA Ticket issue in Congress Telangana : బీసీలకు 34 సీట్లు.. రాష్ట్ర నేతల డిమాండ్​పై ఏఐసీసీ ఫైర్ - ఏఐసీసీ సీరియస్​ ఆన్​ బీసీ నాయకులు

BC MLA Ticket issue in Congress Telangana : కాంగ్రెస్​లో బీసీ నేతలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని దిల్లీ వెళ్లిన నాయకులకి చేదు అనుభవం ఎదురైంది. బీసీలకు 34 సీట్లు కేటాయించాలన్న వారి విజ్ఞప్తిని ఏఐసీసీ తిరస్కరించడమే కాకుండా.. ఎవరికెన్ని సీట్లు ఇవ్వాలో తమకు తెలుసంటూ నిప్పులు చెరిగింది.

KC Venugopal Advice to BC Leaders
BC Leaders Issue in Telangana Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2023, 7:40 AM IST

Telangana Congress MLA Tickets దిల్లీలో వేణుగోపాల్​ని కలిసిన బీసీ నాయకులు

BC MLA Ticket issue in Congress Telangana : ప్రజల్లో ఎలాంటి గందరగోళానికి తావివ్వకుండా గెలుపు ప్రాతిపదికగా పనిచేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ బీసీ నేతలకు(Congress BC Leaders) ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికల్లో 34 సీట్లు కేటాయించాలని దిల్లీ పెద్దల్ని నేతలు కలుస్తానన్నారు. ఈ క్రమంలో కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. ఏఏ సామాజిక వర్గాలకు టికెట్లు కేటాయించాలన్న విషయం తమకు తెలుసని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అంతర్గతంగా తేల్చుకోవాల్సిన వ్యవహారాన్ని మీడియా ముందుకు తెచ్చారని వేణుగోపాల్‌ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Telangana Congress BC MLA Ticket issue : రానున్న ఎన్నికల్లో వెనుకబడిన కులాల వారికి 34 సీట్లు కేటాయించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ బీసీ నేతలు దిల్లీలో తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నెల 27న 50మంది బీసీ నేతలు దిల్లీ వెళ్లి ఏఐసీసీ అగ్రనేతల్ని కలుస్తున్నారు. ఖర్గే, రాహుల్‌తో భేటీ ప్రయత్నిస్తున్నప్పటికీ.. అపాయింట్‌మెంట్‌ లేక వీలుపడటం లేదు. ఈ క్రమంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ను కలిశారు.

Telangana Congress MLA Candidates List 2023 : ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు.. మరో వారంలో జాబితా

పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు తీరు పట్ల కేసీ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బీసీలకు సీట్ల కేటాయింపులో ఏవైనా అనుమానాలు ఉంటే పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించినట్టు తెలిసింది. అలా కాకుండా మీడియా ముందుకెళ్లడం, పత్రికలలో వ్యాసాలు రాయడం.. తదితర అంశాలపై తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది.

Telangana Assembly Elections 2023 : రాష్ట్ర బీసీ ముఖ్య నాయకులతో వేణుగోపాల్(Kc Venugopal) ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. టిక్కెట్లు ఎవరికీ ఇవ్వకూడదో ఎవ్వరికి ఇవ్వాలో తమకు స్పష్టమైన అవగాహన ఉందని స్పష్టం చేసినట్లు సమాచారం. తెలంగాణలో పార్టీకి సానుకూల వాతావరణం ఉందని.. కలిసికట్టుగా పనిచేద్దామని దిశానిర్దేశం చేశారు. ఈ దశలో ప్రత్యర్థులకు ఎంతమాత్రం అవకాశం ఇవ్వొద్దని స్పష్టం చేసినట్లు సమాచారం.

Congress Ticket War in Palamuru : ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ టికెట్​ దక్కించుకునేదెవరు..?

ప్రతి నియోజకవర్గంలో సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయిస్తామని ఈ సమయంలో దిల్లీకి వెళ్లిన దాదాపు 50 మంది నాయకుల్లో కొందరు మాత్రమే వేణుగోపాల్‌తో కలిశారు. ఈ భేటీలో పీసీసీ మాజీ అధ్యక్షుడు హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్యలు లాంటి ముఖ్యులు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ ఖర్గేను కలిసే అవకాశం ఉందని.. సాయంత్రానికి హైదరాబాద్​కి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల తెలిపాయి.

BC MLA Ticket Issue in Congress Party : కాంగ్రెస్​లో బీసీ నేతల పోరుబాట.. 34 సీట్లు తమకే ప్రకటించాలని డిమాండ్

R Krishnaiah Met Ponnala in Hyderabad : పొన్నాల లక్ష్మయ్యతో కృష్ణయ్య భేటీ.. ఆ అంశాలపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.