బీసీ రిజర్వేషన్లపై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరి స్పష్టం చేయాలని... బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ అధ్యక్షతన... అన్ని రాజకీయ పార్టీల నాయకులతో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని కోరారు. బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు తమ డిమాండ్లు తెలియజేస్తూ... ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఛలో దిల్లీ చేపట్టి తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: అన్నాడీఎంకే 'మౌనం'- ఏకాకిగా విజయకాంత్!