రాజ్యాంగ స్ఫూర్తి... రాసుకున్న రాతలు అమలై ఉంటే క్రిమిలేయర్ సమస్య వచ్చేది కాదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పాలించే నాయకులకు రాజ్యాంగాన్ని అర్థం చేసుకునే మెరిట్ ఉండాలని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలే కేంద్ర బిందువుగా పనిచేయాలి తప్పితే.. అందుకు భిన్నంగా వ్యవహారించకూడదన్నారు.
హైదరాబాద్ రవీంద్రభారతి సమావేశ మందిరంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం దైనందిని, కాలమానిని ఆవిష్కరించారు.
భారతదేశంలో ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఇస్తోన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పర్యాటక, అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దేశంలో 60 శాతం ఉన్న బీసీలకు మంత్రిత్వ శాఖ లేకపోవడం సిగ్గుచేటన్నారు. బీసీ ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు తలెత్తిన తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
-
హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారితో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది. @Eatala_Rajender pic.twitter.com/6lUdqYjuSh
— V Srinivas Goud (@VSrinivasGoud) April 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారితో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది. @Eatala_Rajender pic.twitter.com/6lUdqYjuSh
— V Srinivas Goud (@VSrinivasGoud) April 2, 2021హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ గారితో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది. @Eatala_Rajender pic.twitter.com/6lUdqYjuSh
— V Srinivas Goud (@VSrinivasGoud) April 2, 2021
ఇదీ చదవండి: నిజామాబాద్ జిల్లాలో ఘోరం... గోదావరిలో మునిగి ఆరుగురు మృతి