మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలపై బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తక్షణమే ఈటల రాజేందర్‌కు క్షమాపణ చెప్పాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ కూడలి వద్ద రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రచాల యుగేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. మంత్రులతో ఈటలపై అసత్య ఆరోపణలు చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రాష్ట్రంలో 5.5 శాతం ఉన్న అగ్రకులాల నాయకులు ముఖ్యమంత్రి అవగా... సగభాగం ఉన్న బీసీలు ముఖ్యమంత్రి అవకూడదా? అంటూ యుగేందర్ గౌడ్ ప్రశ్నించారు. ఇప్పటికైనా బీసీలకు ద్రోహం చేయకుండా బీసీ మంత్రులు ఈటలకు మద్దతు పలకాలని కోరారు. అసత్య ప్రచారం చేయడం సరికాదని అన్నారు. బీసీలు ఏకమై కొత్త రాజకీయ పార్టీని పెడతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: వెంటిలేటర్ల కొరత... ప్రభుత్వాస్పత్రిలో నలుగురు మృతి !