బీసీ వ్యతిరేక ప్రభుత్వాన్ని గ్రేటర్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సూచించారు. రాష్ట్రంలో బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను వెంటనే కలపాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లింగంపల్లి సుందరయ్య కళానిలయంలో 26 బీసీ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించారు.
బీసీ కులాలను తొలగించే, కలిపే హక్కు ముఖ్యమంత్రికి లేదని మండిపడ్డారు. కులాలను తొలగించే, కలిపి శాస్త్రీయత కేవలం బీసీ కమిషన్‌కు మాత్రమే ఉందని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి సీఎం కేసీఆర్... చేస్తున్న ప్రయత్నాలను గ్రేటర్ ప్రజలు తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. బీసీ వ్యతిరేక విధానాలను అవలంభించే తెరాసకు ఓటర్లు తగిన గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు.
ఇదీ చదవండి: దేశంలోనే సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాం: కేటీఆర్