రాష్ట్రంలో కనీస వైద్య సదుపాయాల్ని కూడా ప్రభుత్వ కల్పించ లేకపోతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మెరుగైన వైద్యం అందించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గైనకాలజీ వైద్యులు లేక పేదలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారని తెలిపారు. 104, 108 సేవలు సైతం అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు. ఐదేళ్ల పాలనలో ఆసుపత్రుల్లో నియామకాలు, భవనాల నిర్మాణం చేపట్టలేదని ఆరోపించారు. కేటీఆర్ నియోజకవర్గంలోనే ఒక్క గైనకాలజీ వైద్యులు లేరంటే రాష్ట్రంలో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చారు. ఆరోగ్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గానికే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి :వీడియో కాన్ఫరెన్స్ విచారణకు హైకోర్టు అనుమతి