ETV Bharat / state

మెల్​బోర్న్​ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో గ్లోబల్​ బతుకమ్మ వేడుకలు

మెల్​బోర్న్​ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో ఆన్​లైన్​ వేదికగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ తెలంగాణ సంస్థలు, కుటుంబ సభ్యులు గ్లోబల్ బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. మంత్రులు హరీశ్​రావు, సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్సీ కవిత, జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ప్రకాశ్​రావు ఆన్​లైన్ వేదిక ద్వారా ప్రసంగించారు.

bathukamma celebrations in melbourne through online
మెల్​బోర్న్​ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో గ్లోబల్​ బతుకమ్మ వేడుకలు
author img

By

Published : Oct 28, 2020, 11:12 AM IST

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ తెలంగాణ సంస్థలు, కుటుంబాలు ఒకే వేదిక పైకి వచ్చి గ్లోబల్ బతుకమ్మ వేడుకలను నిర్వహించాయి. మెల్​బోర్న్​ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో ఆన్​లైన్​లో జరిగిన సంబురాల్లో ఆస్ట్రేలియా, యూకే, అబూదాబి, దుబాయ్, అమెరికా, షార్జా, సింగపూర్, మలేషియా, ఫ్రాన్స్, మనదేశం నుంచి పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. మంత్రులు హరీశ్​రావు, సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్సీ కవిత, జలవనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ప్రకాశ్​రావు ఆన్​లైన్ వేదిక ద్వారా ప్రసంగించారు.

ఆస్ట్రేలియా ఎంపీ కౌశల్య వాఘేలాతో పాటు పలువురు ఇతర ప్రముఖులు, కవులు, గాయకులు పాల్గొన్నారు. కొవిడ్ నేపథ్యంలో ఆన్​లైన్ ద్వారా బతుకమ్మ పండగను సంబురంగా నిర్వహించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: లండన్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.