Bathukamma celebrations in Ireland : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ సంబురాలు ఎల్లలు దాటాయి. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు ఎన్నారైలు బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు(Telanganites Of Ireland) బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. డబ్లిన్ నగరంలో ముప్పై మంది వాలంటీర్స్ కలిసి ఈ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు.
Bathukamma Celebrations At Telangana Secretariat : నూతన సచివాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
గత 11 సంవత్సరాలుగా ఈ బతుకమ్మ వేడుకలను వాలంటీర్లు, దాతల సాయంతో ఉచితంగా నిర్వహిస్తున్నారు. సుమారు ముప్పై మంది వాలంటీర్లు, నలభై మంది దాతలు ముందుకొచ్చి బంగారు బతుకమ్మ వేడుకలు ప్రతి సంవత్సరం జరపడానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఐర్లాండ్‌లో బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రస్తుత అధ్యక్షుడు దయాకర్ రెడ్డి కొమురెల్లి, కమలాకర్ రెడ్డి కొలను, ఆర్గనైజేషన్ సభ్యులు కలిసి ఐర్లాండ్ తెలంగాణ ఎన్నారై ఫోరమ్ వ్యవస్థాపకుడు ప్రభోద్ రెడ్డి మేకల, ఉప వ్యవస్థాపక సభ్యడు సిద్ధం సాగర్లను ఘనంగా సత్కరించారు .
అమెరికాలో.. ‘టీపాడ్’ ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ, దసరా వేడుకలు
ఈ బతుకమ్మ వేడుకలకు ప్రాంతాలకు అతీతంగా సుమారు 850 మంది హాజరయ్యారు. పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన తెలంగాణ వాసులు అంతా.. ఒక వద్ద చేరి బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై బతుకమ్మ, కోలాటం, దాండియా ఆటలను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడిపాడి సందడి చేశారు. మగవారు సైతం బతుకమ్మ పాటలకు డాన్స్‌లు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజా కార్యక్రమం ఘనంగా చేశారు. బతుకమ్మ, దాండియా ఆటలు అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడి పిల్లలకి తెలియజేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ఎన్నారైలు ప్రతి సంవత్సరం బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు.
MLC Kavitha Bathukamma Video : బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత.. తోటి మహిళలతో కలిసి ఆటాపాట