ETV Bharat / state

పద్మవ్యూహం... బయటకు రావడం ఎలా?

హైదరాబాద్​లోని కాలనీలు, గల్లీలో ఏర్పాటు చేసిన బారికేడ్లు ఉద్యోగులకు పద్మవ్యూహంలా మారాయి. ప్రభుత్వ, ప్రైవేటు, బ్యాంకు, ఆసుపత్రి, మీడియాల్లో పనిచేసే వారు, ఉద్యోగులు, సిబ్బంది రాత్రి ఇంటికి వెళ్లేప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసు అధికారులను అభ్యర్థించి బారికేడ్లు తీయించుకుని వెళ్తున్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొన్ని వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.

పద్మవ్యూహం... బయటకు రావడం ఎలా?
పద్మవ్యూహం... బయటకు రావడం ఎలా?
author img

By

Published : Apr 24, 2020, 10:05 AM IST

"ఖైరతాబాద్‌లోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న రాజేశ్​ పద్మారావునగర్‌ సమీపంలోని శ్రీనివాసనగర్‌లో ఉంటున్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు బైక్‌పై పయనమయ్యాడు. పద్మారావునగర్‌ వరకూ సజావుగా వెళ్లాడు. స్కందగిరి దేవాలయం దాటాక ఇంటికి వెళ్లే దారిలో బారికేడ్లు కనిపించాయి. మరోమార్గం వైపు వెళ్లగా అక్కడా బారికేడ్లున్నాయి. ఇంకోవైపు వెళ్లగా అక్కడా అదే పరిస్థితి. ఎటు వెళ్లాలో తెలీక మళ్లీ మొదటికి వచ్చి అక్కడున్నవారిని అభ్యర్థించి బైక్‌పట్టేంత స్థలం వరకూ బారికేడ్‌ తీయించి వెళ్లాడు"

- బుధవారం ఓ ప్రభుత్వ ఉద్యోగి ఎదుర్కొన్న అనుభవమిది.

ఇది కేవలం పద్మారావు నగర్‌కు మాత్రమే పరిమితం కాలేదు.. హైదరాబాద్​లో 90 శాతం కాలనీలు, గల్లీల్లో బారికేడ్లు కనిపిస్తున్నాయి. ఉదయం నిరాటంకంగా బయటకు వస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు, బ్యాంకు, ఆసుపత్రి, మీడియాల్లో పనిచేసే వారు, ఉద్యోగులు, సిబ్బంది రాత్రి ఇంటికి వెళ్లేప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చుట్టూ తిరిగి వెళ్లలేక...

ఉదయం నుంచి సాయంత్రం వరకూ విధులు నిర్వహించి ఇళ్లకు వెళ్తున్న వారు రోజూ ఇంటికి వెళ్లేదారిలో కాకుండా చుట్టూ తిరిగి వెళ్తున్నారు. మరికొందరు చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ అధికారులను అభ్యర్థించి బారికేడ్లు తీయించుకుని వెళ్తున్నారు. ఖైరతాబాద్‌, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్‌, నారాయణగూడ, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, కూకట్‌పల్లి, అమీర్‌పేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, లింగంపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లోని కాలనీలు, గల్లీలు, గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాంతాల్లో నివసిస్తున్నవారు రాత్రివేళల్లో ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొన్ని వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు.

barricades-problems-in-hyderabad-due-to-lockdown
పద్మవ్యూహం... బయటకు రావడం ఎలా?

కాలనీలు.. గల్లీలు.. అపార్ట్‌మెంట్లు.. స్థానిక పోలీసులు..

కరోనా వైరస్‌ విజృంభిస్తుండడం.. పోలీసులు హెచ్చరిస్తుండడం వల్ల కాలనీలు, అపార్ట్‌మెంట్ల సంక్షేమ సంఘాలు కర్ఫ్యూ సమయానికి పదిహేను నిమిషాల ముందే అనుసంధాన రహదారులను బారికేడ్లతో మూసేస్తున్నారు. ఉదయం వరకూ అలాగే ఉంచుతున్నారు. కర్ఫ్యూ వేళా ప్రధాన ప్రాంతాలు సహా గల్లీల వాసుల్లో 30 నుంచి 40 శాతం వరకు వాహనాలపై వస్తున్నారని గుర్తించిన పోలీసులు ప్రధాన రహదారులకు దారితీసే మార్గాలన్నీ మూసేస్తున్నారు. రాత్రివేళ బయటకు వస్తున్న వారిని ప్రశ్నించి నిజంగా అవసరమున్నవారిని మాత్రమే వదులుతున్నారు.

"లాక్‌డౌస్‌ వేళా కొందరు అవసరం లేకున్నా రోడ్లపైకి వస్తున్నారు. అందుకే అనుసంధాన రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశాం. మూడు వైపులా బారికేడ్లు ఉంచి ఒకవైపు తెరిచే ఉంచుతున్నాం. కొందరికి అసౌకర్యంగా ఉన్నా... ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసులు, ప్రభుత్వానికి సహకరించండి. మరీ ఇబ్బందిగా అనిపిస్తే 100కు ఫోన్‌ చేయండి."

-అంజనీ కుమార్‌, హైదరాబాద్​ సీపీ

ఇదీ చూడండి: దేశంలోనే మొట్టమొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్‌ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.