ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం వీధుల్లో భక్తులు విహరించకుండా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున... మంత్రాలయానికి వచ్చే భక్తులు స్వామి దర్శనం అనంతరం మఠం వీధుల్లో గుమిగూడకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాఘవేంద్ర స్వామి మఠంలో నిత్య పూజలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కరోనా తీవ్రతపై మంత్రి ఈటల సమీక్ష