అక్టోబర్ 1 నుంచి 15 వరకు బరోడా కిసాన్ పక్వాడా సంబురాలు నిర్వహించనున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలంగాణ రీజన్ జీఎం శ్రీనివాస్ తెలిపారు. దేశానికి వెన్నెముకగా ఉంటూ, సేవలందిస్తోన్న రైతులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే పదిహేను రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో రైతుల కోసం ప్రత్యేక స్కీమ్లు ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. తమ బ్యాంక్ నుంచి వ్యవసాయ ఋణాలు ఎలా తీసుకోవాలో తెలుపుతామని... తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 484 బ్యాంక్ శాఖల్లో అన్నదాతలతో సత్సంబంధాలు పెంచుకునేందుకు కిసాన్ మేళా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అక్టోబర్ 16న వరల్డ్ ఫుడ్ డే పురస్కరించుకుని బరోడా కిసాన్ దివాస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
- ఇదీ చూడండి : కుప్పకూలిన బ్యాంకింగ్ రంగ షేర్లు