ETV Bharat / state

కవితకు మద్దతుగా ఆ నగరాల్లో ఫ్లెక్సీలు - కవిత దీక్ష

Banners supporting MLC Kavitha in Hyderabad: ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్​ కోసం చేస్తున్న దీక్షకు పలువురు నేతలు మద్దతు పలుకుతున్నారు. ఆమె వెంటే ఉంటామని హామీ ఇస్తున్నారు. మద్యం కేసులో బీజేపీ ప్రభుత్వంపై బీఆర్​ఎస్​ నాయకులు విమర్శలు చేశారు. మరోవైపు ఈ కేసులో కేంద్రానికి వ్యతిరేకంగా కవితకు మద్దతుగా హైదరాబాద్, దిల్లీల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 10, 2023, 1:12 PM IST

Banners supporting MLC Kavitha in Hyderabad: కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించిన తన అనుకున్న లక్ష్యాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దైర్యంగా ముందుకు వెళ్లి సాధించి తీరుతోందని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి తెలిపారు. తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ మహోత్సవంలో వాణీదేవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు.

Banners supporting MLC Kavitha in Delhi : పుట్టుకతోనే ఎన్నో అవాంతరాలను అధికమిస్తూ బాలికలు లోకంలో అడుగుపెడుతున్నారని.. ఆటంకాలను ఎదుర్కొంటు పోరాట పటిమతో ముందుకు వెళ్తున్నారని అన్నారు. 33 శాతం మహిళ రిజర్వేషన్ల బిల్లు సాధన కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటం సఫలీకృతం అవుతుందని ఆమె ఆకాంక్షించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 33శాతం మహిళా రిజర్వేషన్ కోసం చేస్తున్న పోరాటానికి తెలంగాణ ప్రవేటు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంధం రాములు మద్దతు పలికారు.

మేమంతా కవితక్క వెంటే ఉంటాం:అరవింద్‌ అలిశెట్టి: మద్యం కేసులో ఈ నెల 11న ఈడీ ఎదుట హాజరుకానున్న బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మద్దతుగా హైదరాబాద్‌, దిల్లీల్లో ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగులు వెలిశాయి. 'ఇండియాను బీజేపీ చెర నుంచి రక్షించాలి.. మేమంతా కవితక్క వెంటే ఉంటాం’ అని బీఆర్​ఎస్​ నేత అరవింద్‌ అలిశెట్టి అన్నారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌తో పాటు పంజాగుట్ట, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. సామాజిక మాధ్యమాల్లోనూ కవితకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.

బండి సంజయ్ వెయ్యి కోట్ల ఆసామి ఎలా అయ్యాడు:గజ్జల కాంతం: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావాలనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ ద్వారా నోటీసులు ఇప్పించిందని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ ఛైర్మన్‌ గజ్జల కాంతం విమర్శించారు. తెలంగాణలో ద్విచక్రవాహనంపై తిరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రూ.వెయ్యి కోట్ల ఆసామి అయ్యాడు. కర్ణాటకలో ప్రజాప్రతినిధుల ఇంట్లో రూ. కోట్లు బయటపడ్డాయి.. మరి వారిపై ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసు ఇవ్వడం సరికాదని బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, గుండ్రాతి శారదా గౌడ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ప్రతికూలంగా వ్యవహరిస్తోందని ఈ ఘటనతో తెలిసిందని అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.