రాష్ట్రంలో బ్యాంకర్లు, వారి కుటుంబసభ్యులు కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. 18 ఏళ్లు, ఆపై వయసు కలిగిన వారందరూ ఇందుకు అర్హులని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించారు.
అన్ని ఆర్థిక సంస్థలు, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, నాబార్డు సంస్థలకు అనుమతి ఇస్తున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆసుపత్రులతో ఒప్పందం చేసుకుని, పని చేసే చోటే వ్యాక్సిన్ వేయించుకోవడానికి కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఈ మేరకు ఎస్ఎల్‌బీసీ కన్వీనర్, ఆర్బీఐ ప్రాంతీయ మేనేజర్, నాబార్డు సీజీఎంకు సమాచారం ఇచ్చినట్లు ఆయన వివరించారు.