తెలంగాణలో లాక్‌డౌన్ అమలు సందర్భంగా కుదించిన బ్యాంకు సమయ వేళలు ఈనెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ తెలిపింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్యాంకు సేవలు ఖాతాదారులకు అందుబాటులో ఉంటాయని వివరించింది. బ్యాంకు సేవలు ఖాతాదారులకు అందుబాటులో ఉన్న సమయంలో... కొవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని బ్యాంకులకు సూచించింది.
మాస్కు ధరించి, సాధారణ ఉష్ణోగ్రతలు కలిగి ఉన్న వాళ్లనే బ్యాంకులోకి అనుమతించాలని చెప్పింది. అదేవిధంగా ప్రవేశ ద్వారం వద్ద విధిగా శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. బ్యాంకులో పని చేసే సమయంలో కూడా వీలైనంత వరకు ఉద్యోగులు భౌతిక దూరాన్ని పాటించాలని సూచించింది. ఉద్యోగులు అంతా భయంతో కాకుండా బాధ్యతతో మెలిగినట్లయితే వ్యాప్తిని నిలువరించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది.
ఇదీ చదవండి: హై-ఫై మాస్కులతో కరోనా అంతమయ్యేనా?