ETV Bharat / state

పోలీసుల కస్టడీలో నందకుమార్​.. ఆ కేసులపై విచారణ

Nandakumar in Police custody : 'ఎమ్మెల్యేలకు ఎర' కేసు నిందితుడు నందకుమార్​ను బంజారాహిల్స్​ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఫిలింనగర్‌లోని దక్కన్ కిచెన్ స్థలాన్ని సబ్ ​లీజుకు ఇచ్చి డబ్బులు వసూలు చేశారన్న కేసు దర్యాప్తులో భాగంగా చంచల్​గూడ జైలు నుంచి స్టేషన్​కు తరలించారు. దక్కన్ కిచెన్ స్థలం లీజ్, సబ్‌ లీజుకు సంబంధించిన కేసులో పోలీసులు నందకుమార్​ను ప్రశ్నిస్తున్నారు.

పోలీసుల కస్టడీలో నందకుమార్​.. ఆ కేసులపై విచారణ
పోలీసుల కస్టడీలో నందకుమార్​.. ఆ కేసులపై విచారణ
author img

By

Published : Nov 28, 2022, 11:39 AM IST

Updated : Nov 28, 2022, 12:25 PM IST

Nandakumar in Police custody : ఎమ్మెల్యేలకు ఎర కేసు ప్రధాన నిందితుల్లో ఒకరైన నందకుమార్‌ను బంజారాహిల్స్​ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఫిలింనగర్‌లోని దక్కన్ కిచెన్ స్థలాన్ని సబ్ ​లీజుకు ఇచ్చి డబ్బులు వసూలు చేశారన్న కేసు దర్యాప్తులో భాగంగా నందకుమార్​​ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. విచారించిన కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం చంచల్​గూడ జైలులో ఉన్న నందకుమార్​ను.. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్​ పోలీసులు స్టేషన్​కు తీసుకొచ్చారు. దక్కన్ కిచెన్ స్థలం లీజ్, సబ్‌ లీజుకు సంబంధించి నందకుమార్​ను ప్రశ్నిస్తున్నారు. రేపూ నందకుమార్​ను ప్రశ్నించనున్నారు.

ఫిలింనగర్‌లోని దక్కన్ కిచెన్ విషయంలో నందకుమార్‌పై కేసు నమోదైంది. హీరో దగ్గుబాటి రానా, నిర్మాత సురేశ్​ బాబులకు సంబంధించిన ఈ భూమిని లీజుకు తీసుకున్న నందు.. ఆ ప్రదేశంలో అక్రమ నిర్మాణాలు చేపట్టి సబ్‌ లీజ్‌కు ఇచ్చి డబ్బులు వసూలు చేశారని ముగ్గురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఐపీసీ సెక్షన్ 406, 420, 506 కింద మూడు వేర్వేరు కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా నందకుమార్​ను రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు.

మరోసారి సిట్‌ ముందుకు చిత్రలేఖ..: మరోవైపు 'ఎమ్మెల్యేలకు ఎర' కేసులో నందకుమార్​ భార్య చిత్రలేఖ నేడు మరోసారి సిట్​ విచారణకు హాజరయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఆమెను సుదీర్ఘంగా విచారించిన సిట్‌ బృందం.. అనుమానాలు నివృత్తి కాకపోవడంతో ఈరోజు మళ్లీ రావాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే చిత్రలేఖ ఈరోజు మరోసారి సిట్​ ముందు హాజరయ్యారు.

ఇవీ చూడండి..

'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. నేడు మరోసారి సిట్‌ ముందుకు చిత్రలేఖ

నందకుమార్​కు చెందిన అక్రమ నిర్మాణాల కూల్చివేత.. వివరణ ఇచ్చిన జీహెచ్‌ఎంసీ..

Last Updated : Nov 28, 2022, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.