హైదరాబాద్ పోలీసులు స్పందించిన తీరుకు సామాజిక మాధ్యమంలో మహిళ అభినందనలు తెలిపింది. అర్ధరాత్రి బంజారాహిల్స్ రోడ్‌నంబరులో 12లోని ఎమ్మెల్యేల నివాసప్రాంగణంలో కొందరు యువకులు మద్యం సేవిస్తూ అలజడి సృష్టించారు. ఆ ఖాళీస్థలం పక్కనే నివాసముండే ఓ మహిళ పోలీసులకు సమాచారమిచ్చింది.
ఆమె ఫిర్యాదుపై స్పందించిన ఠాణా ఎస్సై శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని మద్యం సేవిస్తున్న వారిని అక్కడి నుంచి పంపివేశారు. సకాలంలో స్పందించిన పోలీసులను ప్రశంసిస్తూ సామాజిక మాధ్యమంలో ఆమె ధన్యవాదాలు తెలియజేసింది. ప్రజారక్షణలో నగర పోలీసులు చూపిన చొరవను అందరూ అభినందిస్తున్నారు.
