ETV Bharat / state

తొలిరోజు ముగిసిన నందకుమార్ కస్టడీ విచారణ.. 5 గంటల పాటు ప్రశ్నల వర్షం - Nandakumar latest news

Nandakumar in Police custody : 'ఎమ్మెల్యేలకు ఎర' కేసు నిందితుడు నందకుమార్​ బంజారాహిల్స్​ పోలీసుల విచారణ ముగిసింది. నందకుమార్‌ను బంజారాహిల్స్ పీఎస్‌లో పోలీసులు ప్రశ్నించారు. తొలిరోజు విచారణ అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. రేపు మరోమారు నందకుమార్‌ను ప్రశ్నించనున్నారు.

Nandakumar
Nandakumar
author img

By

Published : Nov 28, 2022, 4:10 PM IST

Updated : Nov 28, 2022, 4:36 PM IST

Nandakumar in Police custody : ఎమ్మెల్యేలకు ఎర కేసు ప్రధాన నిందితుల్లో ఒకరైన నందకుమార్‌ను బంజారాహిల్స్​ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. మొదటి రోజు ఐదున్నర గంటల పాటు పోలీసులు విచారణ చేపట్టారు. అడ్వాకేట్ నాగరాజు సమక్షంలో విచారణ కొనసాగింది. ఫిలింనగర్‌లోని దక్కన్ కిచెన్ స్థలాన్ని సబ్ ​లీజుకు ఇచ్చి డబ్బులు వసూలు చేశారన్న కేసు దర్యాప్తులో భాగంగా నందకుమార్​​ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. విచారించిన కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం చంచల్​గూడ జైలులో ఉన్న నందకుమార్​ను.. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్​ పోలీసులు స్టేషన్​కు తీసుకొచ్చారు. దక్కన్ కిచెన్ స్థలం లీజ్, సబ్‌ లీజుకు సంబంధించి నందకుమార్​ను ప్రశ్నించారు. ఆర్ధిక లావాదేవీలు, లీజ్ అగ్రిమెంట్ విషయాలపై ప్రశ్నలు సంధించిన పోలీసులు... తొలిరోజు విచారణ అనంతరం నందకుమార్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. రేపు మరోమారు నందకుమార్​ను ప్రశ్నించనున్నారు.

ఫిలింనగర్‌లోని దక్కన్ కిచెన్ విషయంలో నందకుమార్‌పై కేసు నమోదైంది. హీరో దగ్గుబాటి రానా, నిర్మాత సురేశ్​ బాబులకు సంబంధించిన ఈ భూమిని లీజుకు తీసుకున్న నందు.. ఆ ప్రదేశంలో అక్రమ నిర్మాణాలు చేపట్టి సబ్‌ లీజ్‌కు ఇచ్చి డబ్బులు వసూలు చేశారని ముగ్గురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఐపీసీ సెక్షన్ 406, 420, 506 కింద మూడు వేర్వేరు కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా నందకుమార్​ను రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు.

ఇవీ చూడండి..

Last Updated : Nov 28, 2022, 4:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.