ETV Bharat / state

విశాఖ తీరంలో బంగ్లాదేశ్ నౌక... ప్రత్యేక రోడ్డు ఏర్పాటు - Bangladesh ship Reached Visakha coastal Area news

బంగ్లాదేశ్​కు చెందిన ఎంవిమా 80 మీటర్ల పొడవైన నౌక ఏపీలోని విశాఖ తీరంలో యాంకరేజ్​లో ఉంది. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి సమయంలో సముద్రంలో వీచిన ఈదురు గాలుల ధాటికి షిప్ యాంకర్ చైన్ తెగిపోవడంతో తెన్నేటి పార్క్ సమీపంలోకి కొట్టుకొచ్చింది.

బంగ్లాదేశ్ నౌకలో ఆయిల్​ తొలగించేందుకు చర్యలు... ప్రత్యేక రోడ్డు ఏర్పాటు

author img

By

Published : Oct 17, 2020, 4:20 PM IST

బంగ్లాదేశ్​కు చెందిన ఎంవిమా 80 మీటర్ల పొడవైన నౌక 2800 మెట్రిక్ టన్నుల క్వార్టైజ్​ను మోంగ్లా పోర్టుకు తీసుకువెళ్లేందుకు ఏపీలోని విశాఖ తీరంలో యాంకరేజ్​లో ఉంది. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి సమయంలో సముద్రంలో వీచిన ఈదురు గాలుల ధాటికి షిప్ యాంకర్ చైన్ తెగిపోవడంతో తెన్నేటి పార్క్ సమీపంలోకి కొట్టుకుని వచ్చింది. ఈ షిప్​లో 41 మెట్రిక్ టన్నుల ఫ్యూయల్, 9 మెట్రిక్ టన్నుల డీజిల్ ఉంది. ఇదే విషయాన్ని షిప్ యజమానికి తెలియజేసి షిప్​లోని అయిల్​ను తీసేందుకు మెస్సర్స్ ఎంఎస్ గిల్ మెరైన్​కు బాధ్యతలు అప్పగించారు. గిల్ మెరైన్ అయిల్​ను తీసేందుకు అవసరమైన అన్ని అనుమతులను ప్రభుత్వ సంస్ధల నుంచి తీసుకుంది.

అయితే షిప్ ఉన్న ప్రదేశానికి చేరుకునేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో తాత్కాలికంగా ఒక రోడ్డును నిర్మించారు. షిప్ వద్ద పనులు చేపట్టేందుకు అవసరమైన మనుషులను సామగ్రిని తరలించేందుకు వీలుగా ఈ తాత్కాలిక రోడ్డును నిర్మించారు. షిప్ చుట్టూ ఎటువంటి అయిల్ లీకేజీ లేకుండా చూసేందుకు విశాఖ పోర్టు ట్రస్టు నుంచి అవసరమైన సుశిక్షితులైన సిబ్బందిని పరికరాలను పంపించారు. షిప్ నుంచి ఆయిల్​ను తొలగించడానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పడుతుంది.

బీచ్​లో ఎటువంటి ఆయిల్ కలవకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ.. షిప్​లోని ఆయిల్​ను తీసివేసిన తరువాత తిరిగి సముద్రంలోకి తీసుకువెళ్లే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకోసం షిప్ యజమాని ఎంఎస్ రిసాల్వ్ మెరైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధతో ఇప్పటికే ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటి వరకూ షిప్​లోనికి నీరు చేరడం గానీ షిప్ నుంచి ఆయిల్ లీకేజీ వంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. బంగ్లాదేశ్​కు చెందిన 15 మంది సిబ్బంది ఇప్పటికీ షిప్​లోనే ఉన్నారు. షిప్​లో విద్యుత్ సరఫరాను పునరుద్దరించేందుకు ఎంఎస్ గిల్ మెరైన్ సంస్ధ ఒక జనరేటర్​ను ఏర్పాటు చేసింది.

ఇదీ చదవండి: కేసీఆర్​కు చిత్తశుద్ధి ఉంటే.. బయటపెట్టాలి: డీకే అరుణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.