ETV Bharat / state

ఇంట్లోనే ఉన్న బోల్డ్‌ బ్యూటీ.. అయినా కరోనా!

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారి తాండవం చేస్తోంది. వైరస్​ బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటివన్నీ చేయాలి. ఈ జాగ్రత్తలన్నీ తాను తీసుకున్నా.. కరోనా బారిన పడ్డానంటోంది బంగ్లాదేశీ- అమెరికన్‌ బ్యూటీ బ్లాగర్‌ నబేలా నూర్‌. రెండున్నర నెలల పాటు ఇంటికే పరిమితమైన ఆమెకు వైరస్‌ ఎలా సోకింది? తనలో కనిపించిన లక్షణాలేంటి? రోజురోజుకీ తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటోంది? తదితర విషయాల గురించి వివరిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతోందీ బ్యూటీ.

bangaladesh
ఇంట్లోనే ఉన్న బోల్డ్‌ బ్యూటీ​.. అయినా కరోనా!
author img

By

Published : Jun 3, 2020, 6:33 PM IST

నబేలా నూర్‌.. బంగ్లాదేశీ- అమెరికన్‌ బ్యూటీ బ్లాగర్‌. ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ వేదికగా మేకప్‌ పాఠాలు, సౌందర్య చిట్కాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను పంచుకుంటూ అందరికీ మరింత దగ్గరైంది. చాలా బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన బబ్లీ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకోవడానికి ఏమాత్రం వెనకాడదు. ఈ క్రమంలో నెటిజన్ల నుంచి బాడీ షేమింగ్‌, ఫ్యాట్‌ షేమింగ్‌ను ఎదుర్కొన్నా సరే.. అలాంటి విమర్శల్ని అస్సలు పట్టించుకోనంటోందీ బోల్డ్‌ బ్యూటీ. అలాంటి వారి మాటల గురించి పదే పదే ఆలోచిస్తూ మనసు పాడుచేసుకోవడం కంటే.. ఎలా ఉన్నా సరే మనల్ని మనం ప్రేమించుకోవడం, మన శరీరాన్ని మనం అంగీకరించడం వల్ల సంతోషంగా, పాజిటివ్‌గా ఉండచ్చంటూ తన ఫ్యాన్స్‌లో స్ఫూర్తి నింపుతోందీ బ్యూటిఫుల్‌ బేబ్‌.

ఐదు సార్లు బయటికెళ్లా!

లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన నూర్‌.. తాను ఎంత జాగ్రత్తగా ఉన్నా తనకు కరోనా సోకిందంటోంది. ఈ క్రమంలో తను డల్‌గా ఉన్న ఓ సెల్ఫీ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తూ ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టింది. ‘

" తాజాగా నాకు కొవిడ్‌- 19 పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. నేను గత 75 రోజులుగా ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నా. ఈ క్రమంలో నాకెదురైన అనుభవాలను ఓ పుస్తకంలో రాసుకుంటున్నా. అయితే ఈ రెండున్నర నెలల కాలంలో ఐదు సార్లు మాత్రం బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఇలా గడప దాటిన ప్రతిసారీ చాలా జాగ్రత్తలు తీసుకున్నా. మాస్క్‌ ధరించడం, సామాజిక దూరం పాటించడం, పదే పదే చేతులు శుభ్రం చేసుకోవడం.. ఇలా కరోనా నుంచి దూరంగా ఉండడానికి పాటించాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకున్నా. అయినప్పటికీ నాలుగు రోజులుగా నాలో వైరల్‌ ఇన్ఫెక్షన్‌ లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నా. ఆ రిపోర్టుల్లో నాకు పాజిటివ్‌ అని తేలింది. నాకు చాలా భయమేసింది. ఏడ్చా.. కానీ నాకు దేవుడిపై నమ్మకముంది. నా ఆరోగ్యం విషయంలో ఆ భగవంతుడిపైనే భారమేశా. ఈ కష్ట సమయంలో నా భర్త సేత్‌ మార్టిన్‌ కూడా నాకెంతో మద్దతుగా నిలుస్తున్నారు. నన్ను ఓదార్చుతున్నారు. నీకేం కాదంటూ నాలో ధైర్యం నింపుతున్నారు. భార్యాభర్తలంటే సుఖంలోనే కాదు. కష్ట సమయంలోనూ ఒకరికొకరు తోడూ- నీడగా ఉండాలని నా భర్త మరోసారి నిరూపించారు. ఆయనకు కేవలం థ్యాంక్స్‌ చెబితే సరిపోదు. ప్రస్తుతం నేను కొవిడ్‌- 19కి చికిత్స తీసుకుంటున్నా. నా రోజువారీ ఆరోగ్య పరిస్థితి గురించి షార్ట్‌ వీడియోల రూపంలో ఇన్‌స్టా ద్వారా మీ అందరితో పంచుకుంటా."

---- బ్యూటీ బ్లాగర్‌ నబేలా నూర్‌

మరో పోస్ట్..

తన కరోనా లక్షణాల గురించి తెలియజేస్తూ మరో పోస్ట్‌ పెట్టింది నూర్‌. క్వారంటైన్‌లో భాగంగా తన డెయిలీ రొటీన్‌ను ఓ షార్ట్‌ వీడియోగా రూపొందించి దాన్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఈ బోల్డ్‌ గర్ల్‌.. ‘ఈ రోజంతా ఎంతో ఇబ్బందిగా, అసౌకర్యంగా గడిచింది. కరోనా లక్షణాల్లో భాగంగా శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపించింది. అలాగే విపరీతమైన తలనొప్పి, ముక్కు దిబ్బడ, దగ్గు, చలి.. వంటి లక్షణాలతో రాత్రంతా నరకం అనుభవించా. వీటి నుంచి ఉపశమనం పొందడానికి.. కాస్త కష్టంగా అనిపించినా సరే.. ఆవిరి పట్టడం వల్ల పలు హోమ్‌ రెమెడీస్‌ పాటించా. నాకు ఏమవుతుందోనని ప్రస్తుతం కాస్త భయంగానే ఉన్నా.. ధైర్యం తెచ్చుకొని సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నా. పాజిటివ్ ఆలోచనలే మనలో ఉన్న భయాల్ని, ఆందోళనల్ని దూరం చేసి ఎలాంటి అనారోగ్యాల నుంచైనా మనల్ని బయటపడేస్తాయి..’ అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

ఫ్యాన్స్​కు సూచన..

సానుకూల దృక్పథం ఉంటే ఎలాంటి అనారోగ్యాన్నైనా ఎదుర్కోవచ్చంటోన్న నూర్‌.. కరోనాను నిర్లక్ష్యం చేయద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరం కాకపోతే ఇంటి పట్టునే ఉండడం మేలంటూ తన ఫ్యాన్స్‌కు సూచిస్తోంది. మరి, ఈ బోల్డ్‌ బ్యూటీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని మనమూ ఆశిద్దాం..!

ఇవీ చూడండి: పొలం చదును చేస్తుండగా బయటపడ్డ లంకె బిందెలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.