భాజపా కార్యకర్తలు వంద రూపాయలకి తగ్గకుండా పీఎం కేర్స్ నిధికి సాయం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. పీఎం కేర్స్ నిధికి ప్రతి కార్యకర్త మరో పది మందితో సాయం చేయించాలని సూచించారు.
రేపు ఉ.11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట మధ్య పీఎం కేర్స్ నిధికి విరాళాలు ఇవ్వాలని కోరారు. విరాళమిచ్చినట్లు స్క్రీన్ షాట్ తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయాలని సంజయ్ సూచించారు. సింగరేణి కార్మికుల వేతనాల్లో కోత విధించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. సింగరేణి కార్మికులు ప్రభుత్వానికి ఒకరోజు వేతనం రూ.7.50 కోట్లు విరాళం ఇచ్చారని సంజయ్ పేర్కొన్నారు.