ETV Bharat / state

ఎస్​ఈసీ పార్థసారథి రాజీనామాకు బండి సంజయ్ డిమాండ్ - The latest news from the Telangana government

ఎస్ఈసీ సర్క్యూలర్‌ను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి మరో మొట్టికాయ వేసిందని వెల్లడించారు. ఎస్ఈసీ పార్థసారథి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Bandi Sanjay spoke on the High Court verdict
ఎస్​ఈసీ రాజీనామా చేయకపోతే ప్రభుత్వం బర్తరఫ్ చేయాలి: బండి
author img

By

Published : Dec 4, 2020, 11:57 AM IST

స్వస్తిక్ గుర్తుతో పాటు ఇతర గుర్తులతో వేసినా ఓట్లుగా పరిణగించాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. ఈ తీర్పుతో ఉన్నత న్యాయస్థానం... ప్రభుత్వానికి మరో మొట్టికాయ వేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఎస్ఈసీతో రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై ఈ వివాదాస్పద సర్క్యూలర్ జారీచేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవాలనే యత్నాన్ని హైకోర్టు అడ్డుకుందని తెలిపారు.

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్‌ పత్రాల్లో స్వస్తిక్‌ గుర్తు ఉన్న వాటినే కాకుండా సంబంధిత పోలింగ్‌ కేంద్రాన్ని సూచించే స్టాంపు వేసినా ఓట్లుగా పరిగణించాలంటూ ఎస్ఈసీ గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎస్​ఈసీ జారీ చేసిన సర్క్యులర్​ను సవాల్​ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్​పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం సర్క్యులర్​ అమలును నిలిపివేసింది.

హైకోర్టు తీర్పు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచిందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఎస్ఈసీ పార్థసారథి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఈసీ రాజీనామా చేయకపోతే ప్రభుత్వమే బర్తరఫ్ చేయాలని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.