ETV Bharat / state

కేసీఆర్‌ రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి, వందల కోట్ల ఆఫర్.. కానీ..!! - కేసీఆర్‌ రాజగోపాల్‌రెడ్డికి వందల కోట్ల ఆఫర్

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజగోపాల్‌రెడ్డికి భారీ ఆఫర్ ఇచ్చారని బండి సంజయ్ భాజపా బహిరంగసభలో ఆరోపించారు. తెరాసలో చేరితే మంత్రి పదవి, వందల కోట్ల రూపాయలు ఆఫర్ ప్రకటించారని.. అయిన రాజగోపాల్‌రెడ్డి వాటిని తిరస్కరించినట్లు పేర్కొన్నారు. అటువంటి ఆయన్ని మనం గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.

Bandi Sanjay said that Rajagopal Reddy joined the BJP despite being promised a ministerial position and hundreds of crores
కేసీఆర్‌ రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి, వందల కోట్ల ఆఫర్.. కానీ..!!
author img

By

Published : Sep 22, 2022, 8:46 PM IST

Updated : Sep 22, 2022, 10:51 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌... రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి, వందల కోట్ల ఆఫర్ ప్రకటించారని బండి సంజయ్ ఆరోపించారు. పెద్ద అంబర్‌పేట్‌లో ఏర్పాటు చేసిన భాజపా భారీ బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు మునుగోడులో ఓడిపోతామనే భయం పట్టుకుందని.. అందుకే ఆయన కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారని పేర్కొన్నారు.

అయితే రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరకముందు ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలిపారు. తెరాస పార్టీలో చేరితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవితో పాటు... వందల కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు. అయినా రాజగోపాల్‌రెడ్డి ఆ ఆఫర్‌ను తిరస్కరించి... మంచి కోసం పనిచేసే భాజపాలో చేరారని గుర్తు చేశారు.

అటువంటి రాజగోపాల్‌రెడ్డిని మనం గెలిపించుకోవాలా...లేదా.. అని ప్రజలను బండి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రలోభాలు పెట్టినా రాజగోపాల్‌రెడ్డి... వాటికి ప్రభావితం కాకుండా ... ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో భాజపాలో చేరారని వ్యాఖ్యానించారు. ఆయన్ని గెలిపించుకునే బాధ్యత మనఅందరిది అని గుర్తు చేశారు.

కేసీఆర్‌ రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి, వందల కోట్ల ఆఫర్.. కానీ..!!

ఇవీ చూడండి:

Last Updated : Sep 22, 2022, 10:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.