ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం వల్లే ప్రజలు భాజపా వైపు చూస్తున్నారని తెలిపారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ప్రజా సంగ్రామ యాత్ర సన్నాహాక సమావేశం వివరాలను వెల్లడించారు.
రాష్ట్రంలో భాజపాకు అనుకూలమైన మార్పు వచ్చిందని సంజయ్ తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రను కాంగ్రెస్, తెరాస తక్కువ అంచనా వేశాయన్నారు. కేంద్ర నాయకత్వం అన్ని విధాలుగా అండగా ఉందని చెప్పారు. యాదాద్రి నుంచి భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు మూడో విడత పాదయాత్ర సాగుతుందని తెలిపారు. పాలమూరులో పాదయాత్ర ద్వారా రాజకీయ సమీకరణాలు మారిపోయాయని స్పష్టం చేశారు. భాజపా అధికారంలోకి వస్తేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్ర తమ ప్రాంతాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధమే. ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం వల్లే ప్రజలు భాజపా వైపు చూస్తున్నారు. తెలంగాణలో భాజపాకు అనుకూలమైన మార్పు వచ్చింది. కాంగ్రెస్, తెరాస ప్రజా సంగ్రామ యాత్రను తక్కువ అంచనా వేశాయి. కేంద్ర నాయకత్వం అన్ని విధాలుగా అండగా ఉంది. యాదాద్రి నుంచి భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు మూడో విడత పాదయాత్ర సాగుతుంది. పాలమూరులో పాదయాత్ర ద్వారా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. భాజపా అధికారంలోకి వస్తేనే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు భావిస్తున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర తమ ప్రాంతాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి: