భారత సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi sanjay fires on KCR) ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాను సమర్థించేలా ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. నిద్రాహారాలు మాని దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తూ ప్రజలకోసం ప్రాణాలర్పిస్తున్న సైనికుల ఆత్మస్థైర్యాన్ని కేసీఆర్ దెబ్బతీశారని మండిపడ్డారు.
దేశ సార్వభౌమత్వాన్ని కేసీఆర్ అవమానించారు. దేశం పట్ల గౌరవం లేని మీరు.. ప్రధాని కావాలని ఎలా అనుకుంటారు.? చైనాను సమర్థించేలా ఎలా మాట్లాడతారు.? దేశ సరిహద్దుల్లో చైనా సైనికులను భారత జవానులు తరిమి తరిమి కొట్టారు. దేశం కోసం ఎందరో ప్రాణాలర్పించారు. నిద్రాహారాలు మాని దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బ తీసేలా కేసీఆర్ మాట్లాడారు. -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
చైనాలో తెరాస వ్యాపారాలు పెట్టుకునేందుకు ఆ దేశాన్ని సమర్థిస్తారా అని బండి సంజయ్(Bandi sanjay fires on KCR) ప్రశ్నించారు. సార్వభౌమత్వాన్ని పరిరక్షించాల్సిన పదవిలో ఉండి.. అవమానించేలా ఎలా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత జవాన్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Bandi Sanjay on KCR: 'సీఎం సొంత జిల్లాలోనే ఆత్మహత్యలు.. రైతుల కోసం ఏం చేశారు.?'