ETV Bharat / state

Bandi sanjay: 'మహనీయుల బలిదానాలు వృథా కానివ్వబోం'

author img

By

Published : Jul 31, 2021, 1:25 PM IST

Updated : Jul 31, 2021, 2:35 PM IST

తెలంగాణ ఏర్పాటు సాకారంలో మహనీయుల బలిదానాలు వృథా కానివ్వబోమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ స్పష్టం చేశారు. తెలంగాణ పావన భూమి అని పేర్కొన్నారు. భాజపా జాతీయ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ వర్క్​షాప్​లో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు వర్క్​షాప్​ ద్వారా సామాజిక మాధ్యమాలను వినియోగింది పార్టీ సిద్ధాంతాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

Bandi sanjay
బండి సంజయ్​

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కావడానికి తెలంగాణ చిన్నమ్మ స్వర్గీయ సుష్మాస్వరాజ్ కృషి ఎంతో ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. వేలాది మంది బలిదానాలతోనే ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని వెల్లడించారు. భాజపా జాతీయ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మీడియా, సోషల్ మీడియా ఇన్​ఛార్జ్​ల జాతీయ స్థాయి వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. నాంపల్లి భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ వర్క్ షాప్​కి అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళా మోర్ఛా జాతీయ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్, దుష్యంత్ కుమార్, బండి సంజయ్, భాజపా మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, గౌతమ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ వర్క్​ షాపు ద్వారా తనకు ప్రేరణ, ఉత్సాహం కలుగుతోందని సంజయ్​ అన్నారు. తనకు ఈ అవకాశాన్ని కల్పించిన పార్టీ జాతీయ నాయకత్వానికి, మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్​కు ధన్యవాదాలు తెలిపారు. దేశ వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా, సోషల్ మీడియా ఇన్​ఛార్జ్​లు పోషించాల్సిన పాత్రపై దిశానిర్దేశం చేస్తున్నారు.

బలిదానాలు వృథా కానివ్వబోం

తెలంగాణలో భాజపా సైద్ధాంతిక భావజాలం వ్యాప్తి కోసం, పార్టీ జెండా ఎగరేయడానికి, నమ్మిన సిద్దాంతం కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని బండి సంజయ్​ గుర్తుచేశారు. వేలాది మంది పోరాటవీరులు నక్సలైట్ల చేతిలో తమ ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహనీయుల బలిదానాలు వృథా కానివ్వబోమని.. వారి స్ఫూర్తితో జాతీయవాద భావజాలాన్ని ముందుకు తీసుకెళతామని స్పష్టం చేశారు. ఇందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. తెలంగాణలో కాషాయ జెండాను ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ వర్క్‌షాప్‌లో వివిధ రాష్ట్రాల భాజపా ప్రతినిధులు పాల్గొన్నారు.

గట్టి కౌంటర్లు వేయాలి

భాజపా సిద్ధాంతాన్ని.. సోషల్ మీడియా ద్వారా క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలని భాజపా మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్​ సూచించారు. సోషల్ మీడియా ప్రజలకు అత్యంత చేరువైందని.. కాంగ్రెస్ పార్టీ నేతలు మోదీ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ఆరోపణలపై సామాజిక మాధ్యమాల్లో గట్టిగా కౌంటర్లు వేయాలని.. పార్టీ ఖ్యాతి, సంక్షేమ పథకాలను కాపాడటంలో మీడియా, సోషల్ మీడియా విభాగాలు పని చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రజలకు చెప్పలేకపోయా..

2019లో తాను ఎంపీగా ఓడిపోవడం సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించుకోకపోవడమే అని డీకే అరుణ అభిప్రాయపడ్డారు. తాను పార్టీ మారిన విషయాన్ని ప్రజలకు చెప్పలేకపోయానని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో సామాజిక మాధ్యమాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక మాధ్యమాన్ని వినియోగించాలని.. మోదీ సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.

మోర్చాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో వివిధ మోర్చాల పనితీరును అడిగి తెలుసుకుంటున్నారు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చేలా మోర్చాలను బలోపేతం చేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని దిశా నిర్దేశం చేస్తున్నారు.

ఇదీ చదవండి: VENKAIAH NAIDU: తెలుగు భాషా పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలి: ఉపరాష్ట్రపతి

Last Updated : Jul 31, 2021, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.