Bandi Sanjay Comments on KCR : రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలనపై.. కేంద్ర ప్రభుత్వం డేగ కళ్లతో చూస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ గెలవద్దని కేసీఆర్ భావిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో గెలిచిన వాళ్లు ఎలాగూ.. బీఆర్ఎస్‌లోకి వస్తారని ముఖ్యమంత్రి అనుకుంటున్నారని.. అందుకే హస్తం పార్టీని ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు
Bandi Sanjay Fires on Congress : బీఆర్ఎస్ బలహీనంగా ఉన్న చోట.. 30మంది కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అందుకే హస్తం నేతలకు ముఖ్యమంత్రి ప్యాకెట్ మనీ ఇస్తున్నారని విమర్శించారు. భారత్ రాష్ట్ర సమితితో కలిసి పోటీ చేస్తామని.. గతంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి చెప్పారని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ అనుకుంటే సరిపోదని.. ప్రజలు అనుకోవాలని బండి సంజయ్ పేర్కొన్నారు.
Bandi Sanjay Fires on BRS Government : ఈ క్రమంలోనే డిపాజిట్లు ఏ పార్టీ కోల్పోతుందో అందరికీ తెలుసని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో.. బీఆర్ఎస్పై.. బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు. ఈ విషయాన్ని మరిచిపోయి కాంగ్రెస్ నాయకులు అద్దాల మేడలో ఉంటూ సంతోష పడుతున్నారని దుయ్యబట్టారు. తమ పార్టీ పట్ల.. రాష్ట్ర ప్రజలు సానుకూలంగా ఉన్నారని బండి సంజయ్ చెప్పారు.
రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితిపై.. భారతీయ జనతా పార్టీ గెలుస్తోందని బండి సంజయ్ స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌కు ఓటు ఎందుకు వేయాలో ప్రజలు ఆలోచిస్తున్నారని తెలిపారు. అనంతరం.. బండి సంజయ్ నాగర్‌కర్నూల్‌లో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించేందుకు బయలుదేరి వెళ్లారు.
Bandi Sanajay comments on CM KCR : 'ధరణి బాధితులతో.. సభ నిర్వహిస్తే పరేడ్‌గ్రౌండ్ నిండిపోతుంది'
"వచ్చే ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ అనుకుంటే సరిపోదు.. ప్రజలు అనుకోవాలి. బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేస్తామని కోమటిరెడ్డి, జానారెడ్డి చెప్పారు. హుజురాబాద్‌లో బీఆర్ఎస్‌పై బీజేపీ గెలిచింది. బీజేపీ పట్ల రాష్ట్ర ప్రజలు సానుకూలంగా ఉన్నారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్పై బీజేపీ గెలుస్తోంది. కాంగ్రెస్‌కు ఓటు ఎందుకు వేయాలో ప్రజలు ఆలోచిస్తున్నారు." - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా నాగర్ కర్నూల్‌లో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో జేపీ నడ్డా పాల్గొంటారు. ఇప్పటికే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. జేపీ నడ్డా సాయంత్రం 4:20 గంటలకు శంషాబాద్ నుంచి హెలికాప్టర్లో నాగర్ కర్నూల్‌కు బయల్దేరి 4.45కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతారు. ఇప్పటికే ఈ సభకు సంబంధించి ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తి చేసింది.
ఇవీ చదవండి: Bandi Sanjay Fires on Congress : 'బీజేపీ నుంచి ఎవరూ వెళ్లరు.. 'మునిగిపోయే నావ'లో వెళ్లేవారిని ఆపేది లేదు'